పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

మును ఖద్దరుప్రచారమును వెల్లివిరియునట్లుగఁ జేసెను.వంగ దేశమంతయు నీమహాత్యాగికి అనుచరులైరి. కావున ఈతనిని నిరంకుశాధికారవర్గమువారు శిక్షింప యత్నించి యేదో నేరము మోపి విచారణకు దెచ్చిరి. విచారణను ఆపి రిమాండునందు కొంతకాల ముంచి యేనేరమును మోపి శిక్ష వేయవలయునా యని యాలోచించి పోలీసు లొక సెక్షన్ క్రింద నేరస్థాపనజేసిరి. అందఱను విడిపింపఁగల శక్తిగల దాను తనపై తెచ్చిన నేరమునందు తన్ను సమర్థించుకొనువాదమున కే బూనుకొనలేదు. స్టేటుమెంటు నొకదాని నిచ్చెను. మాజస్ట్రేటు శిక్షించవలయునను పట్టుదలతో నుండినందున శిక్ష వేసెను. ఆసంవత్సరమే అన్ని రాష్ట్రములవారును దాసును కాంగ్రెసు అధ్యక్షునిగా నెన్నుకొనియుండిరి. డిసంబరు 10 వ తేది నిర్బంధింపబడినవాఁ డెట్లును కాంగ్రెసు అధ్యక్షపదవికిగాను విడుదల బొంద లేదు. ఆసంవత్సరములో కాంగ్రెసు మహాసభాధ్యక్షుఁడు లేకయే సభ జరుపఁబడెను. అట్టిసభ యిదివరకు భారతదేశమున జరుపఁబడ లేదు. మహాత్ముఁ డప్పటివరకు నిర్బంధింపఁబడ లేదు. కాఁబట్టి ఆసంవత్సరము అధ్యక్షవిరహితసభను మిక్కిలి నేర్పుతో జరపెను. వెంటనే మహాత్ముఁడుకూడ నిర్బంధింపఁబడెను. దేశ