పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

51

కానేరదు. మనకందఱకు మాతయగు భారతమునకుచేయు సేవయే నిజమగువిద్య. ఇప్పట్లో దీనికి అవకాశముమెండు. ఈపొత్తుతల్లి సందేశమునంపి నప్పుడు దీనికి ఎవ్వరు సంసిద్ధు లయ్యెదరు?

ఓమితవాదమిత్రులారా! ప్రపంచచరిత్రమును ప్రారంభమునందుండి సింహావలోకన మొనరింపుఁడు. మీరనుసరించిన మార్గముగుండా ఏజాతి యైనను కొంత స్వాతంత్ర్యమునైన బడసినదా? దేశమున గల్గియుండు వేదన మిమ్మును చలింపచేసినట్లు అగుపడదు. ఈవేదన నిరంకుశాధి కారవర్గముతో కలిగిన సంఘర్షణమే కారణము గలిగియున్నది. ఇట్టి సంమర్షణములవలననే ప్రపంచమున జాతు లుత్పన్నము లైనవని చరిత్ర ఘోషించుచున్నది. శాంతము నణుమాత్రమును చెదరనీయక ధైర్యస్థైర్యసాహసములతో మీరిప్పు డా వేదన ననుభవింపవలెను. మీరు దౌర్జన్యవిరహితపథమున మెలగునంతకాలమును నిరంకుశాధికారుల అక్రమమున నుంచగలుగుదురు. మీకు గాంధిమహాత్ముఁడు ఏర్పఱచిన హింసారాహిత్యమగు శాంతయుత పథమును మీరణుమాత్రము దాటినను మీరు నిరంకుశాధికారుల కోడిపోయెదరు. స్వరాజ్యము భాగభాగములుగను