పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27

లకు చేసిననష్టమును వర్ణించి తీరదు. ఈప్రవాహముచే కొంపలు గోల్పోయినవారును, పైర్లు కొట్టుకొనిపోవుటచే బీదలైనవారును, వస్త్రహీనులును ఆకలిచే పస్తుపరుండిన వార్లును, వీరినందఱనుచిత్తరంజనుఁడు స్వయముగా వెళ్లి చూచి వెంటనే ఒకకష్టనివారక సంఘము నేర్పఱచి దానికై ధార్మికులను సందర్శించి గొప్పనిధిని సేకరించెను. ఆనిధికి తాను పదివేలరూప్యములను ధర్మార్థముగ నొసంగెను. గ్రామములలో కష్టపడు బీదలను గమనించి వారికి సాయపడుటకు గ్రామసంఘముల నేర్పఱచెను. ప్రతిబీద వానికి కొంత ధనమిచ్చి ఏదైన పరిశ్రమజేసి బ్రతుకునట్లు వీళ్లు కలిగించెను. ఇట్లు అనేక బీదలకుఁ దోడ్పడుచు దేశబంధువను బిరుదమునకు సార్థకుఁడయ్యెను. ఈమహానుభావునకు దేశభక్తియనగా సంఘభక్తియనియే భావము. ఈసంఘభక్తిచే కష్టపడుచుండు మానవకోటిపై అపారప్రేమ బొడగట్టెను. ఇట్టిప్రేమ తనలో జనించుటచే భగవంతుఁడు ప్రేమస్వరూపుఁడనియు, భగవంతుని స్వరూపములైన మానవులెల్లరును పూజార్హులనియు కావుననే మానవసోదరులను కాపాడిన భగవంతుని ఆరాధించిన ట్లగునని ఈతని పూర్ణమగు నమ్మకము.