పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

ద్రవ్యము అపారముగ నొసగఁబడెను. బంగాళా సారస్వతాభివృద్ధికిగాను కూడెడు అనేకసభలకు ద్రవ్యమొసంగెను. వంగీయ సాహిత్యపరిషత్సభకు 350 అపూర్వ వంగీయగ్రంథముల నొసంగి కీర్తి గాంచెను. చిత్తరంజనుని ధనసాహాయ్యము పొందని సారస్వతసభ బంగాళాలోనే లేదనవలయును ఇట్టి వదాన్యుఁడును, లోకోత్తరుఁడును త్యాగియునైనవాఁడు వేఱొక డుండట అరుదు.

సాంఘిక దురాచారము.

చిత్తరంజనునకు పాశ్చాత్యవిద్యాప్రభావము నాస్తికమతాభిమానము జనింపఁజేసినది అయినను క్రమేణ ఈశ్వరునికృపచే వైష్ణవగ్రంథపరిశోధనలచే గాఢమగు వైష్ణవభక్తి జనించి కేవలము విష్ణుభక్తుఁడయ్యెను. ఈతని కిరువురు కొమార్తెలును, ఒక కొమారుఁడు గల్గిరి. వైష్ణవుఁడైనను సాంఘికాచారములయందు బ్రహ్మసమాజమువారి త్రోవలను ద్రొక్కుటయందే స్థిరచిత్తుఁడై అంతర్జాతీయవివాహాభిమానియై తన పెద్దకొమార్తె నొక కాయస్థ బ్రహ్మచారికిచ్చి వివాహము జేసెను. ఈవివాహమును జరుపుటకు బ్రాహ్మణ పురోహితుఁడు కూడదని బహుకాలము వాదించి వాదించి భార్య అడ్డు పెట్టగా తుదకు బ్రాహ్మణపురోహితునిగుండానే వివాహమును జరి