పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23

తనకు హితమొసంగినవానికి దెలుపగా నాహితకారి మరలనావిద్యార్థిని చాయగా చిత్తరంజనునిఇంటి కే పొమ్మని ద్వారపాలకులను సడ్డుచేయక ధైర్యముగా లోపలికి పొమ్మనెను. అట్లే వాడొనర్చి చిత్తరంజనుఁడు రాగానే తన గోడునంతయు దీనముగా చెప్పుకొనెను. ఆవిద్యార్థియొక్క సత్యమైన లేమిడిని గుర్తించి వానికి పరీక్షారుసుమునే ఇచ్చినది గాక పరీక్షకాలమగుపర్యంతము కలకత్తాలో నుండునప్పుడు భోజనవసతులకుసై తము అమర్చెను. ఇంతటి గొప్పవాఁడు ఎవరో అల్పుఁడగు విద్యార్థిని ఆదరించకపోయినను ప్రతిష్ఠకు లోటురాదు. అయినచిత్త రంజనుడు బాహ్యప్రతిష్ఠ పనికిమాలినదనియు, దీనులనాదరించినచో పరమేశ్వరుని ఆదరించునట్లే దృఢమైన నమ్మకము గలవాఁడు గనుక ఇట్టి గుప్తదానములను చిత్తరంజనుఁడు చేసినవి వేనవేలని చెప్పవలసియున్నది

చిత్తరంజనుఁడు బంగాళీవిద్యాపోషకుఁడు. అందలి వాజ్మయమునందు ఖిలమైన గ్రంథముల నచ్చొత్తించుటకు వలయుధనసాహాయ్యము నొనర్చెను. వంగభాషాసేవకు మితిలేని ద్రవ్యమొసంగెను. అనేక పాఠశాలలకు ధనమునిచ్చి పోషించెను. చెలాచియావైద్యశాస్త్రపాఠశాలాభవన నిర్మాణమున కితని