పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21

కాల కాదర్శములగు పాతివ్రత్యము, విధేయత మొదలగు స్త్రీ సహజగుణములను నశింపఁ జేయబూను కొనుట కేవల మాత్మహత్యజేసికొనుటకు సమానమనియు, సర్వకాలము నాసభలో గూడియుండిన వారెల్లగును భారతనారీమణు లే యనియు, ప్రాచీన పవిత్రవంతులైన భారత స్త్రీల సుగుణము లే తమవియనియు, వారివలెనే దామును పవిత్రవంతముగ తమకాలమును గడపి ప్రపంచమున ప్రశస్తి గాంచి చనవలయుననియు నుడివెను.

దానధర్మములు.

చిత్తరంజనుఁడు తనన్యాయవాదవృత్తియం దపరిమితధనార్జనను గావించెను కాని, ఆధనమంతయు తండ్రికై తానొనర్చిన ఋణములను దీర్చుటకై కొంతయు, విశేషముగ కష్టపడు బీదసాదలైన నిరుపేద లకొఱకు ధర్మార్థముగ కొంతయును వినియోగ పెట్టఁబడెను. తానార్జించిన ధనమును బీదలకు సద్వినినియోగపరచుటలో నాతనికుండు సంతోషమునకు మేర లేదు. తనకుండు సర్వస్వమును త్యాగముచేసిన గాని భగవంతునిసత్కృపాపాత్రత కెవ్వ డర్హుఁడగును? అసహాయోద్యమమున నాతఁడు ప్రవేశించి న్యాయవాదవృత్తిని వదలినప్పుడు కుటుంబభరణమునకు మూఁడు లక్షల రూప్యములను మరల ఋణ