పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

తంత్రయై, బాలికలకు జాతీయవిద్యను గఱపుటకై నొకపాఠశాలను నిర్మించి దేశసేవచేయుచున్నది.

వివాహము.

1897 వ సంవత్సరమున బిజినీ సంస్థానమునకు దివానుగానుండిన, బాబు వరద హాల్దరనువారి కొమార్తె సుందరాంగి, విదుషీమణియగు వాసంతి దేవిని తనకు సహధర్మచారిణి గావరించి చిత్తరంజనుఁడు వివాహమాడెను. ఈమెగారికి విశ్వవిద్యాలయపు బిరుదు లేకున్నను ఇంటనే విద్యగఱపఁబడుటచే నతి విద్యావ్యాసంగమున కలవాటుపడి గొప్ప విద్వాంసురా లయ్యెను 1919 సం ॥ అమృతసరము నందు జరిగిన మహిళా కాంగ్రెసు సభకు ఈమెను అధ్యక్షురాలినిగా కోరిరి. అయితే అదివఱ కామె గోషాపద్ధతియందే యుండియుండినందున బహిరంగ సభోపన్యాసమును గావించుటకు కొంత స్త్రీసహజ లజ్జునుగాన్పించియుండినను పంజాబు దురంతముల విషయమున పరితాపముగలదై ఎట్టకేల కాపదవి నలంకరించుట కొప్పికొని తన యధ్యక్షకోపన్యాసమున భారతస్త్రీ లందఱును ప్రాచ్యాంగనలగు సీత, సావిత్రులను అనుకరించుటకే యత్నింపవలయు ననియు, కాలానుగుణ్యముగ సందర్భములను కొన్నింటినిమార్చవచ్చునేగాని భారతదేశముయొక్క సార్వ