146 చిన్ననాటి ముచ్చట్లు
పొందు ఆపేక్షతో తోటలను కష్టపడి పెంచినవారే. పోటీ తోటలను పరీక్షించి మార్కులను యిచ్చుటకు అనుభవస్తులగు తెల్లదొరలు, హిందువులు కలసివచ్చి తోటలను పరీక్షించిపోవు చుండెడువారు. ఈ పరీక్షలో నా తోటవరుసగ యెనిమిది సంవత్సరములు గెల్పొంది, వెండిగిన్నెలను బహుమతులను పొందినది. ఈ బహుమతులను లాల్ బాగ్ తోటలో మైసూరుదివాన్గారు పంచిపెట్టుచుండిరి. ఈ యనుభవము వలన నన్నుకూడ తోటలను పరీక్షించుటకు జడ్జిగ యెన్నుకొనిరి.
ఈ నా ఆనందదాయినియైన నందనవనమును ధనాశా పిశాచమావేశించి, హెచ్చుధరకు నేతి వ్యాపారస్తులగు నొక శెట్టిగారి కమ్మితిని.
ఆ తోట విక్రయమువల్ల వచ్చిన ధనమును బ్యాంకులో నుంచితిని. కాని నేను ప్రతి నిత్యము ఆ వూవుతోటలో అనుభవించుచుండిన ఆనందమునకు మాత్రము దూరమైతిని. దానిని అమ్మగా వచ్చిన ధనమునైన నా కంట చూచుటలేదు. ప్రతి నిముషము నాకెంతో ఆనందము చేకూర్చుచుండిన పుష్పరాజములగు నా బంధుమిత్రులున్నూ నా కంటికి శాశ్వతముగ కానరాకుండ పోయిరి. ఈ కారణమున నేను నిరంతర చింతచే కొంతకాలము మందబుద్ధినై గడిపితిని. అదృశ్యమైన నా ఆనందమును గూర్చియే నేను మనన చేయుచుండగా - నాకొకమంచి యోచన తట్టినది. ఆనందము అనగా బ్రహ్మగదా. ఆ బ్రహ్మకు సరస్వతి గృహలక్ష్మి. సరస్వతి చదువులకు రాణి. ఆ చదువులరాణి పేరట నా తోటు విక్రయ ధనము ముడుపుకట్టి యుంచితిని. దానితో 'కేసరి విద్యాలయము'ను స్థాపించి తిరిగి యానందమును పొందదలంచితిని.
ఈ విద్యావన స్థాపనచే నా మనస్సునకు శాంతి కలిగినది. ఈ విద్యాలయపు వేపచెట్ల నీడను కూర్చుండి అక్కడక్కడ కళకళలాడు