చిన్ననాటి ముచ్చట్లు145
కట్టించితిని. ఈ పుష్పవనమంతటికిని నీరు పారుదలకు బావిని త్రవ్వించి దానికి యెలక్ట్రిక్ పంపును అమర్చితిని. ఈ నూతి నీరు అమృతమువలె నుండును.
ఇంటిలో కృష్ణమందిరమును కట్టించితిని. ఈ దేవుని పూజించుటకు కృష్ణతులసి రామతులసి మొదలగు కదంబపూజా ద్రవ్యములను వేసి పెంచితిని. ఇంటిముంగిట బృందావనమును కట్టించి, ఇల్లంతయు చిత్రకూటముగ మార్చితిని. తోటంతయు విద్యుచ్ఛక్తి దీపస్తంభములను నాటించి వాటికి రంగుల డోములను అమర్చితిని. రాత్రి వేళలలో యీ దీపములను వెలిగించిన బృందావనముగనే యుండును. ఇంటిలోపల అన్ని వసతులతో కూడ విద్యుచ్చక్తితో వంట చేసుకొనుటకు వేడినీరు కాగుటకు యేర్పాటుల నమర్చితిని.
క్రోటన్సు (Crotons) యను రంగు చెట్టను సుమారు వెయ్యి తొట్లవరకు బారులు దీర్చియుంచితిని. రకరకముల రంగుచిలుకలను పంజరములలోనుంచి చెట్లకు వ్రేలాడగట్టితిని. దీనిని పాటపాడుతోట (Singing Gardens) యని చెప్పుకొనుచుందురు. అనేక వినోదములతో తోటను దిద్ది తీర్చితిని. ఇది నా బెంగుళూరు పుష్పవన శృంగారము.
బెంగుళూరునందు సర్కారువారు ప్రతి సంవత్సరమును లాల్బాగునందు పుప్ప ప్రదర్శనమును (Flower Show) యేర్పాటు చేయుచుందురు. ఈ సందర్భముననే వూరిలో తోట పోటీకి (Garden Competition) కూడ యేర్పాటు జరుగుచుండును. ఈ తోటపోటీకి బెంగుళూరు సిటిలో యుండువారును, కంట్రోన్మెంటు (దండు)లో యుండు తెల్లదొరలును పాల్గొనుచుందురు. ఈ తోటలు ఒకదానికి మించి యొకటి కనుబడును. అందరు కూడ పోటీలో గెల్పొంది బహుమతులను