పుట:China japan.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
జపాను

ప్రతికూల ఉత్తరచీనా స్వతంత్ర రిపబ్లికుసభ” అధికారము క్రింద నుంచవలెనని కోరినది.నవంబరు 23 వ తేదిని ఇందుకై యుద్ధమునకు కూడ దిగినది.కాని కొందరు కర్షకులు పన్నులీయమని తిరగబడుట వలన జపాను కొంచెము శాంతించి వెనుకకు తగ్గినది.పీపింగు, టీస్ట్సిను మొదలగు నగరముల ప్రజలు చీనా పక్షపాతులే యైనను జపాను సహాయము లేనిదే తాము నెగ్గలేమని తక్కిన మూడు రాష్ట్రముల గవర్నరులకును తెలియ వచ్చినది.కనుక ఈ అయిదు రాష్ట్రములును నేడు చీనానుండి యింకా సంపూర్ణముగా స్వతంత్రములు కాకున్న ను చీనాకందు పలుకుబడి లేదనియు జపాను చెప్పినట్లుగా ఆడి జపానుకు లొంగియుండుచున్న వనియు విశదమగుచున్నది.

₪₪₪మంగోలియా చరిత్ర₪₪₪

మంచుకో దేశమునకు పడమరను రెండుదేశములున్నవి.దక్షిణభాగమునకు లోపలి మంగోలియా అనియు, ఉత్తరభాగమునకు వెలుపలి మంగోలియా లేక మంగోలియన్‌ రిపబ్లికు అనియు పేర్లు.ఈ రెండింటికిని చాలా భేదములున్నవి.మంచూకో రాజవంశమువారు మొట్టమొదట దక్షిణభాగముతో స్నేహముచేసి ఉత్తరభాగమును కూడా బెదరించి చీనానంతటిని జయించి ఒక సామ్రాజ్యముగా కొంతకాలము వరకును పరిపాలించిరి. ఈవిధము గా 1911 వరకు ఉండెను.1911 లో చీనా రిపబ్లికుస్థాపించబడగానే ఉత్తర మంగోలియా