పుట:China japan.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
జపాను

సైబేరియాలో ఒకప్పుడు జపాను సేనలు మిక్కుటముగ దిగినను, వానిని తిరిగీ తీసుకొని పోవలసి వచ్చెను. చీనాలో టనాకా గవర్నమెంటు పలుకుబడి హెచ్చి జపానుద్వేషము ప్రబలి జపానుదాడి ధిక్కరించబడుచున్నది. కొరియాలో జపాను ప్రతికూలతత్వము ప్రబలి జపాను కేప్టను నాకామూరా సంహరింపబడెను.దీనితో జపాను యుద్ధదాహము మరింత ప్రబలెను.యుద్ధము తప్ప ఈకార్యములను చక్కచేయగల సాధనము వేరేలేదని అది నిశ్చయించుకొనెను.చీనా జపాను రెయిల్వే కాన్ఫరెన్సు పుసికి పోవుటనే ఒకమిషగా తీసుకొని అది మరింత సైన్యవృద్ధి చేసుకొనెను.

మంచూరియా ఆక్రమణమునకది కంకణము కట్టుకొనెను. ఇందుకై జపానుకైన సైనికనావిక వ్యయములు 1930-31లో 442.8 మిలియను యెన్నులు.తరువాతి సంవత్సరములో ఈ వ్యయము 4546,697.2, 851.8, 937.3 గా పెరిగి 1935-36లో 1023.0యెన్నులాయెను.1934-35 లో జపాను చేసిన అప్పులు కాక ఆదాయములో నూటికి 70 వంతులు ఇందుక్రిందనే ఖర్చయ్యెను.ఇట్లే ప్రతి సంవత్సరమును అగుచుండె ను.పాశ్చాత్యపూంజీదారు ప్రభుత్వములో ఉన్నంత ప్రజాభిప్రాయగౌరమైనను జపానులో లేదు. అక్కడ సైన్యాధికారు లేదిచెపితే అదేమాట, ఎంత అడిగితే అంత ఇయ్యవలసినదే.ఈ విషయములో ఇటలీ,జర్మనీ ప్రభుత్వములను మించికూడ జపాను ఫ్యాసిస్టు అగుచున్నదనుటకు సందేహము లేదు.