పుట:China japan.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

చీనా-జపాను

జపాను సేనానయకు లెల్లరును పూర్వపుసామురేయి తరమునకు చెందినవారు.జపానుకు కొన్ని విజయములు కలిగేదాకా వీరు బ్రిటిషు సామ్రాజ్యముతో స్నేహముగా ఉండిరి.1904-5 సంవత్సరములో రష్యాపైని విజయము కలిగిన తరువాత జపాను ముక్కనులు తెరచి యేపాశ్చాత్యప్రభుత్వమును లక్ష్యము చేయక తనధీమా మిాదనే తాను వర్తించుచున్నది.దీనికంతటికిని కారణము జపాను ప్రభుత్వము యొక్క 30కేబినెట్టులలోను 11 మిలిటరీ ప్రధానుల(ప్రైముమినిష్టరులు)క్రిందను తక్కిన 19 సివిలు ప్రధానుల క్రిందను నుండుటయే.

జపానులో పార్టీలు

“ధనమూల మిదం జగత్” అని సామెత ఏ ప్రభుత్వము, పార్టీ, పరిశ్రమ, నావలు, సైన్యములు వర్థిల్లవలె నన్నను ధనము ప్రధానము.ఈధనము బ్యాంకుల ఆధీనము.ఈధనయుగములో బ్యాంకులు చేయలేని పని లేదు. ఒకచీటీ వ్రాస్తే యేపనిపడితే ఆపని అగును.ఏపలుకుబడి కావలస్తే ఆపలుకుబడి, పరపతి కలుగును. జపానులో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నవి.ఒకటి మిన్సిటో, ఇంకొకటి సియూకాయ్‌, మొదటిదానికి మిట్సూయీ బ్యాంకు, రెండవ దానికి మిట్సుబీషి బ్యాంకు మూలాధారములు.మిట్సూయూ బ్యాంకు మూడు ధనవత్కుటుంబముల చేతులలో ఉన్నది.జపానులోగల పట్టు, ప్రత్తి, బొగ్గు, నూనె, చక్కెర యంత్ర