పుట:China japan.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

చీనా-జపాను

ఒకటిగాచేసి చీనా ప్రభుత్వమునుండి విడదీసి“ఉత్తర చీనా స్వతంత్ర పరిపాలనాసభ” క్రింద ఉంచినది. అటు తరువాత హోపే, షాంటంగు, షాన్సీ రాష్ట్రములనంటియున్న ప్రదేశములను ఆక్రమించినది. వీనినన్నింటిని వలసరాజ్యముగా చేసికొనుటయే జపాను సంకల్పమని టానాకా మిమోరాండము వల్ల విశదమగుచున్నది.ఇవే వలసరాజ్యములైనచో తక్కిన ప్రాంతములు కూడ సులభముగ జపాను స్వాధీనమగుననుట నిస్సందేహము.

చీనానంతటిని ఈవిధముగా జపాను మ్రింగి వేయుచుండగా క్యూమింగుటాంగు ప్రభుత్వమేమిచేయుచున్నది?చియాంగుకెయిషేకు, వాంగుచిన్‌వెయ్‌, చాంగుహ్సియూలియాంగు మొదలగు క్యూమింగ్టాంగు సేనానులు జపాను నెదుర్కొనలేదు కదా,దానిని ప్రతిఘటింపనిశ్చయించుకొనిన కమ్యూనిష్టు దళములను రూపుమాప ప్రయత్నించు చున్నారు.దీనికంతటికిని వారు ఒకే కారణము చెప్పుచున్నారు.దేశములో శాంతి నెలకొననిదే విదేశప్రభుత్వ ములను తరుమ వీలులేదట.ఇందుకై చీనా జపానుల పరస్పర ఆర్థిక రాజకీయ సహాకారము అసరమట. కనుక జపాను ఆజ్ఞప్రకారము చీనాలో కమ్యూనిష్టు వాసనలు లేకుండాచేయుట ముఖ్యమట. ఇట్లు చేయుట వలన చీనా అంతటిని పూర్తిగా జపాను వలసరాజ్యముగా చేసి మహాద్రోహ మొనరించుచున్నామని వారు గుర్తించకున్నారు.