పుట:Chennapurivelasa018957mbp.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

చెన్నపురీ విలాసము


గామపాలన సహోదరియుఁ గామందకాది నీతిజ్ఞయుఁ గామితార్థ ప్రదాయనియుఁ గామికాద్యాగమాభుజ్ఞయుఁ గామిలాద్య పహాణియుఁ గామనాకామనాతీత స్వభావయుఁ గామచారిణియుఁ గాయికాద్యర్చనప్రీతియుఁ గాయ శుధ్యాది సిద్ధిదయుఁ గారీర్యాదిమన ఫలప్రదయుఁ గారుణ్యవారధియుఁగారణాకారణాతీతయుఁ గారాబంధ ప్రమోచన యుఁ గారండవాదికలిత కాసారైక విహారిణియుఁ గారవల్యాది శాకైకరసియుఁగారికా స్తుతయుఁ గాలాంబుద సమ భాసయుఁ గాలదూతభయంకరియుఁ గాలేయ పంకదిగ్ధాంగియుఁ గాలకంధర కామినియుఁ గాలాగురుప్రధూపై కప్రియయుఁ గాస్వరూపిణియుఁ గావేర్యాది నదీరూపయుఁ గాశీనగర వాసినియుఁ గాశజాధిష్ఠిత స్వాంకయుఁ గాషాయంబరధారుణియుఁ గాశశ్వనది హరిణియుఁ గాసరాసుర మర్దనియుఁ గహళీకమనీ యోరుజఘయుఁ గవిరాజితయుఁ గాళరాత్యాదిసహితయుఁ గాళికాహ్వయయుఁ గాంక్షితార్థ ప్రదాయునియునగు కాత్యాయనీ మహాదేవినిన్ం గాంచినఁ గాలుష్యంబులు కాందిశికంబులుగా నెమఱియును.


మ. అలరారుంబ్రతిశుక్ర వాసర సపర్యారంభముందాహిమా
    చలకన్యామణి గేహసీమన సకేత్సౌవస్తిక స్వస్తియున్‌
    లలితానామ సహస్ర పూజజని తోల్లసంబు దీపోత్కరం
    బులు తౌర్యత్రికముల్‌ ప్రజాకలకలంల్దుందుభిధ్వానముల్‌

మ. భృగువారోత్సవదర్శనోత్సుకత నారీపూరుషుల్మల్లికా
    ప్రగుదంచత్కచహారులై నడతురోజం దత్పురద్వార్గమా