పుట:Chennapurivelasa018957mbp.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు.

శ్రీవేణుగోపాలస్సహాయః

చతుర్థంబగు పశ్చిమపద్ధతి ప్రారంభము.

అందు బశ్చిమశాఖానగర ప్రకరణము.


———♦————
ప్రధమము

 
గీ.శ్రీ పూర్ణ తోట్లవల్లూ
  రూపవసద్వేణుగోపకొరుగృహద్వార
  ర్ధ్సాపితసమున్న తాద్భుత
  గోపురకృతికర్తనాగగోత్రారమణా.
 

వ.అవధరింపుము.


సీ.పల్లవరంబును బరశువాకయూఁజూళ
           మణలిసైదాపేట మాధవరము
  చేకారెళుంబూరు చెలగునందంబాక
           నుంగముపాక పరంగికొండ
  వ్యాసులవాడయు నడయారునల పెద్ద
          మెట్టుతానాంపేట మేటియైన
  కోటూరునను వెలి పేటలావీటికిఁ
         బశ్చిమంబైన దిగ్బాగమందు

గీ.సౌధహర్మ్యప్రతోళికా సదన నివహ
  హరిలేఖసమంబులై యభివిసారి
  తాయతాన్యోన్యమిళిత రథ్యాభుజాగ్ర
  లనఁజెలువొందుననుగు నెచ్చెలులనంగ.