పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యిచ్చింది కాదని దాన్ని జెబ్బమీంద నఱికి వూరంతా 5-6 గంటలు ಅಟ್ಟುಡಿಕಿನಿಟ್ಟು వుడికించి యేకచ్ఛత్రాధిపత్యంగా ప్రభుత్వం సాగించి పోలీసువారు వస్తూన్నారని తెలిసి వొక చెట్టెక్కి సాయుధుండుగా కూర్చున్నాండు. ఆ చెట్టుయెక్కడంలో యేకోంతిన్నీ వాcడికిపోలదని నేను అనుకున్నాను. వాణ్ణి పట్టుకోవడానికి శక్యమయిందికాదు. తుదకేలాగయితేయేమి కిందపడేటట్టు చేశారు. చేతులోవున్న బ్రాందిబుడ్లు పగిలి గాజుముక్కలు గుచ్చుకొని చచ్చాండన్నారు. చెప్పేదేమిటంటే? వానరజాతిగూడా యించుమించు నరజాతికి దీటయిందే. కాదుకాదు లాఘవంలో చాలాఅతిశయిస్తుంది. దాన్ని పట్టుకో వలసివస్తే సుఖసుఖాల జరుగుతుందా; దానిచేత గాయాలుపడి చాలామంది ఆసుపత్రిలో కట్టుకట్టించుకోవలసి వచ్చింది. తరవాతయోవత్లో పట్టుకుంటామన్నారు. యిఱవైయైదు రూపాయిలిమ్మన్నారు. దస్తుచేసి యిచ్చుకున్నాము. సకలచిక్కులుపడి యేలాగయితే యేమి ప్రాణావశేషంగా వున్నప్పడే పట్టుకున్నారు. కొవ్వూరు ప్రాంతంలో వదిలిపెట్టినట్టున్నూ తరువాత అది అక్కడ మరణించినట్టున్నూ విన్నాము. చెప్పేదేమిటంటే? యెంత చిక్కువచ్చినా కోంతినిగాని పందికొక్కునుగాని చంపడానికిఁగాని చంపించడానికిఁ గాని మన హిందువులు సమ్మతించరు. మాంసభక్షకులు స్వహస్త పరహస్తాలచేత యేవో కొన్ని జంతువుల చావుకు సమ్మతించేవారే అయినా పయి జంతువుల విషయంలో బ్రాహ్మణులతోపాటువారే. ΟΟΟΟ విషయంలో పాశ్చాత్యులే అయితే లేశమున్నూ వెనుదీయరు. వారికిదానివల్ల ప్రత్యవాయం కలిగినట్టున్నూ వినం. మనకయితే వెంటనే కలిగి తీరుతుంది. దానితోపదిమందిన్నీ“అదుగో ఆ పనిచేశాండు. వెంటనే దృష్టాంతం కనపడిందంటారు. “యదనంతర" న్యాయాన్ని బట్టి అదీనిన్నీ సరిగానే తోస్తుంది. పూర్వం యేదేనా ఫచోరకృత్యం చేయవలసివస్తే యేకచ్ఛత్రాధిపత్యంగా యేలే చక్రవర్తికూడా జంకేవాcడు. యిప్పడో పేరుకు గుజ్లో ప్రముఖులెవరో కొందఱుగా వుండడం చేత ప్రత్యవాయజనకమైన పనులు చేసినా వాట్లవల్ల వచ్చే ప్రత్యవాయాలు సంఘముమీఁద "తిలాపాపం తలో పిడికెండు"గా సరుకుపోతూ వున్నాయి. కాని బాధిస్తూ వున్నట్టు లేదు. యేదో ప్రసక్తాను ప్రసక్తంగా యింత వ్రాశాను. గృహస్టుకు యీతిబాధారాహిత్యం చాలా అవసరం. అట్టి యీతిబాధలను కొన్నిటిని కనపటిచి వ్యాఖ్యానించివున్నాను. మటికొన్ని యింకా లేకపోలేదు. అవీ వ్రాస్తాను. భగవంతుఁడు సర్వదయాపరుండు. అట్టియిమోతిబాధలను తొలగించి తనప్రజలకు సర్వవిధాలా సుఖప్రదాత అగుంగాక అని ఆశీర్వదిస్తూ దీన్ని ముగిస్తున్నాను. , ★ ★ ★