పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/73

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈతి బాధలు

77


వెండిబంగారాలు అంకినంతమట్టుకూ సంగ్రహించుకురావడం జరిగేదని చెప్పకుంటారు. యీ బాపతు వాళ్లిప్పడు యేస్వల్పమో తప్ప లేరుగాని యిప్పటికి పన్నెండేళ్లకు పూర్వం వొక దొంగ చాలా దారుణమయినవాండు వుండేవాడు. మృచ్ఛకటిక నాటకంలో వున్న శర్విలకుడికన్నా వాఁడి సామర్థ్యం హెచ్చని నేను అనుభవ పూర్వకంగానే వ్రాస్తూన్నాను. - వాణ్ణియెన్నోసార్లు ఖయిదులో పెట్టినా మళ్లావచ్చింది మొదలు ఆ పనే చేసేవాఁడు. కేళీలను పరీక్షించడం పోలీసువారికి తప్పనిసరి గనుక బీటుతిరిగే పోలీసులు వాణ్ణి పరీక్షించడానికి వెళ్లేటప్పుడు వొంటిప్రాణంతో వెళ్లవలసివచ్చేది. ఆ సమయంలో వాండు తాగివున్నట్టాయెనా వీళ్లను సుఖసుఖాల వదలిపెట్టక యేదో అమర్యాదచేసే వాండు. వాండంటే వీళ్లకుభయం. మొండివాండు రాజుకన్నా బలవంతుండు గదా! తాపీపనిలో చాలా గట్టివాఁడయివుండికూడా వాండు అది నౌకరీ అనిపించుకుంటుందని కాంబోలును మళ్లామళ్లా యీవృత్తిలోనే తిరిగేవాండు - “నిక్కమ్ముగ నొక్కనిన్ గొలుచుకొన్నను దొంగటికమ్ముతక్కువే" అన్న మృచ్ఛకటికకు వాండే యిటీవల వుదాహరణంగా కనంపడతాడు. మనిషిని చంపడమంటే వాండికి కోడినికాదు దోమనిచంపడంకన్నా యొక్కువకాదు. వాcడి జీవితంలో కొన్ని హత్యలయితేచేశాండు కానివాcడికి వురిశిక్షపడలేదు. పట్టపగలు మారోడ్డున వంటెద్దుబండి వెడుతూవుంటే అందులో నగలూ నాణేలూ వున్నాయంటే యెందరు చూస్తూవున్నాసరే! దొంగించాండన్నమాటే. చూచినా చూచినట్టు సాక్ష్యం చెప్పేటట్టయితే శిక్షలోనుంచి వచ్చాక చంపేస్తాండనే భయంచేత సాక్ష్యం చెప్పేవారుకారు. సుమారు వాండికి అఱవై యేళ్లు దాంటీదాంకా యీలాగే నడిచింది. అసలింటికాపులని యెందఱినో యేమిరా అనే పిలిచేవాఁడు. యేపొలాన్నంచేనా వచ్చేటప్పుడు నేనుకనక వాండికి తారసిస్తేయెంతో వినయంగా నమస్కారాలు చేస్తూ వెంటCబడేవాఁడు. ఖయిదులో వున్న రోజుల్లో యితర జిల్లాల ఖయిదీలున్నూ తానున్నూ కలిసికొని మాట్లాడుకొనేటప్పడు తనవూరు కడియమని తెలియడంతోటట్టేవాళ్లు నన్నుంగూర్చి అడిగేవారంటూ కూడాచెప్పేవాఁడు. ఖయిదులో వున్నరోజులలో తానుచేసే చిత్రవిచిత్ర చర్యలు వర్ణిస్తూ యింటిదాంకా వచ్చేవాఁడు. తాగికూడా వుండడంచేత సుఖసుఖాల వదిలిపెట్టేవాండుకాండు. వదలించుకోవడానికి ప్రయత్నిస్తే కనిపెట్టి అనేవాండుకదా? "అయ్యా! నేను దొంగననే హేతువుచేత మీరు భయపడుతూన్నట్టున్నారు నేను దొంగనే అనుకోండి నిజమేకాని సామాన్యులయిళ్లల్లో నేనెన్నఁడూ దొంగతనం చేయను సుమండీ!" అనేవాఁడు. తుదకు ఇప్పటికి 13 ఏళ్లన్నాండు కోరుకొండ తీర్థంతోవలో వొక దొంగతనంచేసి వచ్చి దాన్నిగుడించి వూల్లోవాళ్లు సాక్ష్యం తనకు అనుకూలంగా యివ్వమనేటప్పటికి వాళ్లనందఱినీ నఱకడానికి సంకల్పించుకొని మేదరాణ్ణి బెదిరించి కత్తి సంపాదించి వొకట్టి నడిరోడ్డుమీంద పడవరేవుదగ్గిఅ మొగంకడుక్కుంటూ వున్నప్పడు నటికి యింకోఆండమనిషి యెప్పడో అఱువడిగితే బియ్యం