పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/700

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

804

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


కురుతే కావ్యమ్" పంతులవారు ఋష్యంశ సంభూతులు కాకపోరు. ఆ వాక్యమునకు సార్థక్య మన్య విధమున సంఘటింపదు. పంతులవారు "ఆంధ్రకాళిదాస బిరుదము" వహించిన యుత్తర క్షణమున “భోజరాజంత రాజున్నఁ గాళిదాసంతకవి యుండనే యున్నాఁడు” అనులోకోక్తిని దబ్బిబ్బుచేసియేని సార్ధక్యమును గల్పింప వచ్చునని మాయాశయము. కవివలనఁ బ్రభువునకును బ్రభువువలన కవికిని వన్నెవచ్చుట సహృదయ సమ్మతము. -

శ్లో. మణినా వలయం వలయేన మణి
    ర్మణినా వలయేన విభాతి కరః
    కవినా చ విభు ర్విభునా చ కవి:
    కవినా విభునా ప్రవిభాతి సభా.

ఇట్లు మార్గాంతరమున శ్రీవారి బిరుదమును సమర్ధింపఁ బాటుపడు మమ్మును మామిత్రులు పంతులవా రన్యథాగా భ్రమించినందులకు మావిచారము పట్టజాలకున్నారము. ఇంతవఱకు వ్రాసినదోక భోజపద విచారమే. పంతులవారు వ్రాసిన మఱికొన్ని సంగతుల కుత్తరము లోకుల కొఱకు వ్రాయవలసియున్నది. గ్రంథవిస్తరమగుటచేఁ బ్రస్తుత మింతతో ముగించి వేఱొకపరి దానింగూర్చి వ్రాయనెంచితిమి.


★ ★ ★