పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/701

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

805


గారుశబ్ద విచారము

(5-4-1919 సం||ర కృష్ణాపత్రిక నుండి)

గారుశబ్దము గౌరవార్ధక మని యెఱుఁగనివారు లేరు. కావున దీనిఁ గూర్చి చర్చించుట చర్వితచర్వణము, అయినను ప్రస్తుతకాల వైపరీత్యముంజేసి యీగారు శబ్దాపేక్ష కొందఱ కెంతో యపకృతిని గావింపనుండుటచేఁ జేత నైనంతలోఁ గొంతవ్యాఖ్యాన మొనర్చవలసి వచ్చినది. మనదేశమందనాదిగా, ఈగారు వర్ణాశ్రమాచార పద్ధతులకు లోఁగి ప్రవర్తించుచున్నది. వారియందితర యోగ్యత లున్నను నుండకున్నను బ్రాహ్మణాద్య గ్రవర్ణస్థులను దదనంతరవర్ణస్థులు గారు పదముతో గౌరవించుచున్నారు. లోపల నిష్టమున్నను లేకున్నను బ్రాహ్మణాద్య గ్రవర్ణస్థులును అధికారాది విశిష్ట కారణములచేఁ దదనంతర వర్ణస్థులను గారు పదముతో గౌరవించుచున్నారు. ఆ యీ సందర్భములం బట్టి చూడ గారుపదము కులోన్నతియో, అధికారోన్నతియో, ధనోన్నతియో, విద్యోన్నతియో, కలవారికెల్ల నిరాఘాటముగా వాడఁదగినదిగాఁ దేలుచున్నది. అత్యుత్కృష్ట వంశస్థులనేకులు, అతి కృష్టులగు ననేకులను అధికారాదికారణములచే గారు పదముతో నోరారఁ బిల్చుట లోకమెల్ల నెఱిఁగిన విషయమే. కావున నిందుల కుదాహరణములక్కఱ లేదు. ఇఁకఁ బ్రస్తుతము విద్యనుబట్టి గారుపదము వాడుట యుక్తమే యగునెడల మార్దంగికత్వము కూడ సంగీతాంగమగు విద్య యని యొప్పికొనుచు, ఆవిద్యలో, కొన్ని జిల్లాలకుఁ బెద్దయైన మనుజుని విషయమున నీగారుపద ముపయోగించుట కెవరుగాని యేలకొంకవలెనో? సుంత విచారింప వలసియున్నది. తీఁగె కదిపిన డొంక కదలుచున్నది.

"రహిపుట్ట జంత్రగాత్రముల రాల్గఱఁగించు
                 విమలగాంధర్వంబు విద్య మాకు”

గాంధర్వ మన సంగీతము, దానికే తౌర్యత్రిక మనిపేరు, తౌర్యత్రిక మనగా నృత్తగీతవాద్యములు. మొత్తమీనృత్తగీతవాద్యము లితరులు గూడ విశేషాభిమానముతో నభ్యసించుట యనాదిగా, విననగుచున్నను నియ్యవి వేశ్యాజాతి స్త్రీ పురుషులకుఁ గులవిద్యలని మనపూర్వులభిప్రాయపడి యున్నారు. ఆజాతి స్త్రీ పురుషులలో నీ నృత్తగీతవాద్యములలో నెంతెంత ప్రసిద్దులేని బయలుదేరి యున్నట్లును వాండ్రు