పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/667

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వమూ-బ్రాహ్మణత్వమూ

771


రచించినట్టు కనపడుతుందనిన్నీ అందుచేత నన్నయభట్టుకీ, భారతానికీ సంబంధమే లేదనిన్నీ సుమారిప్పటికి ముప్ఫైయేళ్లనాఁడు వొక క్రొత్తవాదం బయలుదేఱింది. దానికి ఆధారం రాజనరేంద్రుఁడు భారతం రచింపచేశాఁ డని చెప్పడానికి “కారయామాస” అనక "చకార" అని అంతర్భావితణ్యర్థం వాడడమే. అక్కడక్కడ అంతర్భావితణ్యర్థాలు వాడడం కవుల ఆచారంవుంది. ప్రకరణాన్ని బట్టి వ్యాఖ్యాతలు వాట్లని వ్యాఖ్యానిస్తూ వుంటారు. “వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తిః" రాజనరేంద్రుఁడు భట్టారకుణ్ణి ఆహ్వానించడం వగయిరా పీఠికలో వుందాయె. (1) “పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్టము" (2) “ఇవి యేనున్-భారతశ్రవణాసక్తియు..." ఇత్యాదిగా వుండే రాజుగారి వాక్యాలు ఆశ్వాసాదినీ ఆశ్వాసాంతాన్నీ వున్న పద్యాలు, గద్య వీట్ల నన్నిటినీ ఆ “చకార' అనే క్రియ త్రోసివేయఁగలదా? కృష్ణదేవరాయలవలె రాజనరేంద్రుఁడు కవిగా యెక్కడా ప్రతీతి లేదు. కనక ఆవాదం కొలఁదికాలంలోనే అంతరించింది. నిన్నమొన్న నన్నయభట్టు సహాధ్యాయి నారాయణభట్టే కృతికర్తంటూ వాదం బయలుదేరింది. ఆమాటే నిజమైతే “పాయక పాకశాసనికి భారత... తోడయి నిర్వహింపఁగన్" అనే పద్యం చాలా మార్పు చేయాలి. చేస్తే మాత్రం పండితలోకం విశ్వసిస్తుందా? అసలు కవుల చరిత్ర బొత్తిగా లేనప్పుడే యేదో ఆకాశపురాణంగా చెప్పుకొనేవాళ్లు ఆ పుక్కిటిపురాణ వాక్యాలు కొన్ని విశ్వాస్యాలుగా వుండకపోయినా అసలుకి భంగం గలిగించి తుండూ తుపాకీనీ లేకుండా యెగరఁగొట్టి “అహో మూలచ్ఛేదీ తవ పాండిత్య ప్రకర్షః" అన్నమాదిరిగా వుండేవి కావు. భారతానికీ, నన్నయభట్టుకీ సంబంధమే లేకుండా వుండే చరిత్ర యెన్ని ఆధారాలతో వున్నా లోకం విశ్వసించదు. కాని, లెక్కవ్యక్తులు ఒకరిద్దరు మాత్రం చాలా సంతోషిస్తారు.

"ఉ. సీతయు లేదు రావణుని చెల్లెలు లే దలరాముఁ డబ్దిలో
      సేతువు గట్ట లేదతనిచే దివిజారులు చావలేదు సా
      కేత పురమ్ము లే దచటఁ గేకయ పుత్రియు లేదు సర్వము
      న్నూతన సృష్టియే యన జనుల్ విని నవ్వదు రేమొగమ్మునన్."
                                                                      (ఇటీవలి చర్య)

గతించిన చారిత్రిక సంగతులు యెవరు వ్రాసినా సరిగా వుండవు. పౌరాణికగాథలు కూడా సరిగావుండడంలేదుగదా? అతీంద్రియజ్ఞానం కల ఋషులే భిన్నభిన్నంగా వ్రాస్తే యితర పండితులనుగూర్చి చెప్పేదేమిటి? యేరోజు జరిగింది ఆరోజు వ్రాసుకోవడం అప్పటికాలపు పండితులకు అలవాటులేదు. కొన్ని గ్రంథాల చివర గద్యయే లేదు. పుష్పబాణవిలాసం ఆతెగకే చెందుతుంది. విపులమైన వ్యాఖ్యానం దానికి వుంది. కాని