పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/668

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

772

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వ్యాఖ్యాత మూలకారుని పేరు వుటంకించలేదు సరిగదా తన పేరున్నూ ఉటంకించుకోలేదు. శ్రీకృష్ణుని శృంగార చర్యలు ప్రతిపాద్యములుగా పెట్టుకొన్నిట్లు "భువనవిదిత మాసీద్ యచ్ఛరిత్రం” అనే శ్లోకంలో కనపడుతుంది. తరువాత యేశ్లోకంలోనూ ఆవాసన కనుపడదు. కొందఱు పుష్పబాణవిలాసం కాళీదాసకృత మనడం విన్నాను. యిలా వ్రాస్తూవుంటే యేదో తరవాయి వుంటూనే వుంటుంది. కవిత్వం బ్రాహ్మణుల సొమ్మే అని అప్పకవిగాని మఱివొకరు మాదే అని యెవరోగాని రిజిష్టరు చేయించుకోవడానికి యత్నించడం పరిహాసాస్పదం. “దేవుని పెండ్లికి అందఱూ పెద్దలే".


★ ★ ★