పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/503

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నన్నయ్యభట్టు

507


నన్నయ్య వైదికశాఖకనక తి. వెం. కవులు వైదికశాఖకు చెందినవారు కావడంచేత అతణ్ణి గొప్పచేశా రనేవారున్నూ వున్నారు. వారికి వొక నమస్కారం. యెవరికీ నచ్చనిమాట మేము వ్రాస్తేమాత్రం పనిచేస్తుందా? చేయదు.

“ఇంచుకకేమి యజ్వయున్ లోఁగక యాతనిన్ జెనయు” అని ఆపద్యంలోనే వ్రాశాము. దీన్నిబట్టి నియమాలలో సోమయాజులుగారు నన్నయ్యకన్న నలుసంత లొక్కుతారని వ్రాసినట్లు స్పష్టపడుతుంది. యిదిన్నీ మాస్వంతకల్పన కాదు. నన్నయ్యగారి సీసాలు యతితోప్రారంభిస్తేయతితోటే, ప్రాసతోటి ప్రారంభిస్తే ప్రాసతోటే, ఒకదళంలో దానితోటిన్నీ వేఱొకదళంలో దీనితోటిన్నీ ప్రారంభిస్తే ఆప్రకారమే ముగింపఁబడతాయనిన్నీ తక్కిన భారతకవిద్వయంవారి సీసాలు యీ నియమాన్ని అంతగా పాటించినట్లు లేదనిన్నీ విమర్శకులు యిదివఱకే వ్రాసివున్నారు. అయితే నన్నయ్యగారు కూడా యెక్కడో స్వల్పంగా యీనియమాన్నిపాటించక అభ్యనుజ్ఞ యిచ్చివున్నారనికూడా వారేవ్రాశారు. అర్థానుస్వారం గల హ్రస్వ పూర్వక ప్రాసకు అది లేనివర్ణాన్ని నన్నయ్యగా రెక్కడా ప్రాసపెట్టలేదు. తిక్కన్నగారున్నూ పెట్టలేదుగాని-

“క. నగములు. యె! సఁగుపూర్వస్థితిన" అని శాంతిపర్వంలో కాcబోలును వొకచోట సార్థబిందు, నిరర్థబిందువులకు ప్రాస పెట్టినట్లు కనపడుతుంది. యింకా యీలాటివే నీహారలేశాలు కొన్ని శ్రీగిడుగుపంతుల వారు చూపివున్నారు. (జ్ఞకార కకారాలకు యతి పెట్టడం వగయిరాలు కూడా కొందఱు చూపుతారు) “వ్యయము" అనుటకు బదులు "వ్రయము" అని సోమయాజులుగారు దిద్దరానిచోట వాడినారు. అది వ్యావహారికంగాని గ్రాంథికంగాదు. యేవో యిట్టులేతమమయము వగయిరాలు చూపుతారు కొందఱు తిక్కనగారికి. యీమాటలు మనస్సులో పెట్టుకొనియ్యేవే “ఎన్నియో దోసముల్ పొసఁగున్ నన్నయకన్నఁ దిక్కనకు నల్పుండౌనె? తన్మాత్రలోన్" అని వారివారి వాదమును ఖండించు తాత్పర్యంతో వక వాక్యం “అభ్యుపగమ్యవాద" పురస్కారంగా వ్రాసి వున్నాము. దానిని శాఖా ద్వేషంగా అపవదించేవారికి మేము చెప్పఁదగ్గ జవాబు లేశమున్నూలేదు. “సహృదయాః ప్రమాణమ్” అని మాత్రమే మనవి చేయుదుము. నన్నయ్యగారు ప్రయోగించినదే అయితే అది వకవేళ శాస్త్ర విరుద్ధమే అయినా దాన్ని అనుకరించిన తిక్కనాదులను యెవరూ యేమీ అనడానికి అవకాశం లేనట్టు కవిరాక్షసుఁడు సిద్ధాంతీకరించి వున్నాఁడు.

"ఉ. ఆదిని శబ్దశాసనమహాకవి చెప్పిన భారతంబులో" అనే పద్యార్థం యెఱిఁగినవా రందఱూ పైసందర్భాన్ని అంగీకరిస్తారు. దుర్ణయ శబ్దగతణత్వం నన్నయగారి నాటికి