పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/491

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పిష్టషేషణము

495


మేదోవిధముగానున్నది గాని చక్కఁగ లేదని నాతోపాటుగా పాఠకులలోఁగూడ గొందఱనుచున్నారు. అనుట కొకవిద్యాభిలాషియగు పాఠకవరుని జాబునుండి కొన్నిపంక్తు లుదాహరించు చున్నాఁడను.

“సాధారణముగా నేగ్రంథమునైన విమర్శింపఁదలచిన బుద్ధిమంతులు... ... గ్రంథ మిదివఱకు విమర్శింపఁబడినదో లేదో విమర్శింపఁబడి యుండినయెడల... ... దో . ...దో ... ... దో ... ... విమర్శింపఁబడు గ్రంథముతో సంబంధించిన యితర గ్రంథము లేమైన గలవో లేవో... దో ... ...దో ... ... యోజించి విమర్శకుం గడంగుట యుత్తమ పాండితికి లక్షణమని నా సామాన్యబుద్ధిచేఁ దలంతును. అట్లుగాక ... ... అనుకరించినట్లొనర్చిన పర్యవసానము మఱియొక లాగున పరిణమించెడి ... ... విమర్శకు లింతతో తృప్తిగని ... ...గుర్తించి యూరకుందురని తలంచను.”

ఇంత మాత్రమున లోక మెల్లను నిట్లే యభిప్రాయ పడునని యూహింపఁ దగదు. కొందఱు మీ వ్రాఁతను మెచ్చువారుఁగూడ నుండవచ్చును. మన మన వ్రాఁతను మెచ్చువారుఁగూడ నుండవచ్చును. మన మన వ్రాఁతలకు ఫలము లోకారాధనమే కావున నట్టి వ్రాఁతలు గొన్ని తాముకూడఁ బ్రచురింతురని నమ్ముచున్నాఁడను. “విద్యాయాం వ్యసనం ........ యత్రవసంతి నిర్మలగుణాస్తేభ్యోమహ ద్భ్యోనమః" (భర్తృహరి)


★ ★ ★