పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

496



పునఃపేషణము

అయ్యా! మీరింకను వ్రాయుదు రని నేఁదలఁపకున్నను వ్రాయుచునే యున్నారు. మిమ్మును బ్రత్యక్షముగా దర్శింపకున్నను, ఒరుల వలన మీ వయస్సును గూర్చి వినకున్నను నాకన్నఁ జిన్న లని తెలిసికొనుచున్నాండను.

“నాయభిప్రాయము" అను శీర్షిక మొదలుకొని వ్రాసిన పంక్తులలో నేస్వల్పమో తక్క విశేషించి మాయందును, మా గ్రంథములయందును మీ కెక్కుడు ప్రేమముగల్గిన యంశమును దెల్పుచున్నవి - అంతకొకింత వెనుకనున్న - “ఆమహిమమేమి" అను శీర్షికక్రింది యక్కరములు గూడఁ జాలవఱ కట్టివియే యననగును. యిటు లుండఁగా - "తేరగా నున్నవికదా?” అను శీర్షికకు సంబంధించినవ్రాఁత సర్వమును వృథాగా నపవాదాపాదకమై పత్రికాధిపతులకు మామీఁద ద్వేషము కల్గించునదిగా నుండు టేమో? నిజముగా మీవ్రాసినయంశ మందున్నచోఁ బత్రికాధిపతులు మమ్మునడుగ కేల మిన్నకుందురు? వారు మా పేర వ్రాసినజాబు నీ సందర్భములోఁ బ్రచురింపవలసియున్నను, వారిసమ్మతిలేని పనియగుటచే నటు లొనర్పలేదు. మఱియు – “గురుశుశ్రూషయా విద్యా" అను శీర్షికక్రింద మీరు వ్రాసినవ్రాఁత మీ మనస్సునందలి రహస్యమును వెల్లడించుటయే కాక మీవలెనే యితరులు గూడ ననుమాన పడునెడల - "చండాలో౽స్తు” “జ్ఞానహీనో గురు స్త్యాస్యః" లోనగు వాక్యములు వ్యక్తి దూషణకుఁగా మీ రుపయోగించినట్లు చెప్పకచెప్పు తెగలోనివిగా నున్నవి. ఇట్లు ప్రధానవిషయమును బోడిమాటలకు వదలి, యప్రధానమును బెంచిపని కల్పించికొని, యొరులకుఁ బని కల్పించుచుఁ దుట్టతుదను మరల “విషయ మాత్రముగ నిండని ప్రార్థింతును" అని వ్రాయఁగల్గితిరి. నేను విషయమాత్రముగనే వ్రాయుదును. మీ రట్లు వ్రాయలేదని దిజ్మాత్రము చూపితిని. వ్రాయవలసిన విషయమే కప్పట్టదు.

శ్రీకారమునుగూర్చి మరల వ్రాఁతకు దిగితిరి. దిగుటయేకాక “నాటకము కావ్యముకాదని" తెలుపు మనిరి. అంత వఱకును మీవాదమే నిలుచునని మీకుఁ బరిపూర్ణ ధైర్యము కలదు. ‘నాటకము కావ్యము కాదు" అని మీ కుతూహలము ననుసరించి వ్రాయుచున్నాఁడను. ఏమందురా? నాటకమునందు "నాటకత్వ కావ్యత్వములు" రెండును