పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/477

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

క్షంతవ్యుఁడుగారు

481


వుపక్రమణానికి పూర్వగాథ చాలావుంది. ఆ పొత్తము చిరకాలమునాఁడే అచ్చయి వుంది. పనిపడ్డప్పుడు దానిపేరు తెలుపుతాను. యిటీవలి శంకలలో వకశంకని వుపపాదించాను గదా. యింకొకటి కృష్ణునికి ప్రద్యుమ్న సాంబులు కొమాళ్లు కాఁబట్టి వారిద్దఱి కొడుకులున్నూ మనము లవడం బాగుంది కాని, గదుఁడు సోదరుఁడుగదా! అతని కొడుకు మనుమఁడేలా అవుతాఁడంటూ వకశంక. మొట్టమొదట మాతోపాటుగా తానున్నూ గదుణ్ణి ప్రద్యుమ్నాదులతోపాటుగా జమకట్టుకొని యిప్పుడిప్పుడు తప్పు దిద్దుకొన్నట్లు అభినయించడంకూడా జరిగింది. మేము మొదటినుండిన్నీ వీరు మూఁగురున్నూ సోదరులే అన్న అభిప్రాయాన్నే కనపఱిచివున్నాము. జంకుతూ జంకుతూ “క్షంతవ్యుఁడు” గారు శంకించడం ఆరంభించారు. మే మెందుకు సోదరుణ్ణి పుత్రుఁడని మార్చి వ్రాశామో సభాముఖాన్ని వుపన్యసించి మెప్పిస్తాము. దానికోసమేనా సభకు దయచేస్తారేమో అని మనవిచేసుకుంటూ వున్నాను. యివి ప్రధానశంకలు. అప్రధానాలింకా కొన్నివున్నాయి. హృదయం చక్కగావుంటే యేప్రశ్న అడిగినా అడగవచ్చు. తెలుసుకోనున్నూవచ్చు. అది మంచిస్థితిలో లేనప్పుడు “హార్టువీకు"గా వుండడంచేత ఆపురుషుఁడు యేంచేసినా అవ్యక్తంగానే వుంటుంది. వాఁడు యీలోకం కాదని "గంధర్వలోకం" దాఁకా వెళ్లినప్పటికిన్నీ అదిన్నీ తుట్టతుదకు తలవంపునే సంఘటిస్తుందని నా విజ్ఞప్తి వృథాగా పత్రికల గౌరవం చెడఁగొట్టడానికిఁగాని యీపనికి మాలిన శంకలు యెందుకున్నూ పనికిరావు. కనక కాకినాడలో “విమర్శకాగ్రేసరాది" బిరుదులతో ప్రకాశిస్తూవున్న పెద్దలు వున్నారు. వారేమంటారో ఈశంకలకు? వకపర్యాయం కనుక్కుంటే బాగుంటుందని నే నిందు మూలంగా విన్నవిస్తూ ఉన్నాను. యెందుచేతంటే నాకు ప్రస్తుతం ఇంతకన్నా నీరసస్టితిలోనే అయినా గురువుగారిశంకలు ప్రధానంగా ఉత్తరింపవలసిన పని అవశ్యమయిందిగా యేర్పడింది. ఆపెద్దపనిలో ఈ “పిల్లసమేరీ" నిమిత్తం కాలం ఖర్చుపెట్టి పత్రికలకు పనికల్పించడం మంచిదిగా తోఁచడంలేదు. అదీ గోళ్లనితీరేపనే. ఇదిన్నీ అట్టిదే. అయినా వారు గురువు లవడంచేత కొంతగౌరవం వారికి సంబంధించినదానికి యివ్వడం యుక్తం. దేనికో! “ప్రతి చిగిలింతమొక్కా చింతమొక్కతో" అంటూ వెనక వొకాయన సామెత వకటి వాడివున్నాఁడు. కాఁబట్టి సభలో తేల్చేస్తే తీరిపోతుందని తోcచింది. పత్రికవారినికూడా ఈ వాదం యీలాగే తీర్చుకోవలసిందిగా సలహా యివ్వవలసిందని కోరుతాను. లేకపోతే మూల కూర్చుని గిలకడంగనక వాది ప్రతివాదులిద్దఱూ యేదో గిలుకుతూనే వుంటారు. యెంతచక్కనిసమాధానం వ్రాసినప్పటికీ అది యింకా నచ్చలేదనే యేదో దాన్ని గూర్చి అపలపిస్తూనూవుంటారు. వెనకాల తండ్రిగారో, లేక "గంధర్వలోక” స్థజ్ఞాతివర్గమో “మావాఁడిప్రశ్నలకు జవాబులురానేలే"దని హంగుచేస్తూనేవుంటారు. అందుచేత అర్ధాంగీకారంగా "క్షంతవ్య"