పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/478

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

482

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


పదంతో వ్రాసిన విషయాన్ని గూర్చి యేమి, యిటీవల యివేనా నెగ్గకపోతాయా అనుకున్న విషయాలకేమి వకమాటు సభకే పనిచెపితే వీలుగా వుంటుందనుకుంటాను. యీ అంశం యింతగా కాకపోయినా కొంత సూక్ష్మంగా “యింకో అపవాద” అన్నవ్యాసంలో కృష్ణాపత్రికాద్వారా తెల్పడమయింది. యిప్పుడు మఱీస్పష్టంగా తెల్పుతూవున్నాను. వకసంగతి మఱిచాను. ఆసభలోకి “గంధర్వలోకం" చుట్టంగారినికూడా తీసుకు రావలసిందని మనవి. ఆయన పిఠాపురంలోనే వుంటారనుకుంటాను. ఆయన “బహిరంగలేఖ" కూడా సభాముఖాన్ని వినికిచేస్తాను. మీవద్దకు వచ్చిందంటూ తాము "భారతిలో" యిదివఱలో వ్యక్తీకరించిన “బహిరంగలేఖ"ని కూడా తీసుకువస్తే దాన్నీ దీన్నీ సరిచూచి సభాధిపతులు మీకు యేలాటి బంధుసముద్రులు ప్రస్తుతవిషయంలో సహాయులుగా నున్నారో ఆ విషయంకూడా పనిలోపని తేల్చివేస్తారు. దానితో “సర్వం సంపన్నం, సుసంపన్నం"గా సమస్తమూ చక్కపడడం అవుతుంది. యింతే నామనవి. అందునిమిత్తం త్వరపడండి. వచ్చేవోపికవుంటే ఆసభకు నేనేవస్తాను. లేదా? నాతరఫున మీ అన్నచి. సూర్యనారాయణశాస్త్రి రాఁగలడు లేదా! మఱివక రెవరేనా వస్తారు. దానికేమి? “నందో రాజాభవిష్యతి" యింతే ముమ్మాటికిన్నీ నామనవి.


★ ★ ★