పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/475

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యింకో అపవాద

479


మాకవిత్వం అస్తావ్యస్తంగావుంటే దానివల్ల లోకం కోపగించదు మామీఁద. పింగళి వారిని వెక్కిరించామంటే లోకం మండిపడి, వెనక “పూర్వకవుల అపరాధాలు" వ్రాసినవాళ్లకు జరిగించిన సత్కారాన్ని జరిగిస్తుంది. కాఁబట్టి యీవ్యాసం వ్రాయకతప్పిందికాదు. యిప్పుడేనా వెక్కిరింపు విషయం తప్పనితోస్తే క్షమాపణను పత్రికమూలంగా ప్రకటించుకోవడం మంచింది. సమర్థించేయెడల నేనే క్షమాపణను ప్రచురిస్తాను. యింతే నామనవి.

"గంధర్వలోకం" లోనుంచి వచ్చిన పద్యాల ప్యాకట్టు అక్కడ పోస్టాఫీసు లేకపోవడంచేత కాఁబోలు పిఠాపురం పోస్టుద్వారా నాకు “బట్టువాడా" అయింది. పోస్టుముద్ర యీ అంశాన్ని తెలిపింది. మీకే పోస్టు నుండి వచ్చిందో తెలుపఁగోరతాను. "ఫోర్జరీ" వ్రాఁతలు వ్రాసే మిత్రులున్నారని మీరు మీ వ్యాసంలో యే కొంచెమో తెల్పకపోతే నేను మీకు అంటఁగట్టడం తటస్థించకపోయేదే. మీరేవ్రాసికొనివున్నారు గనుక నాకిప్పుడు సుళువిచ్చింది. "అట్టి తిట్లు నేనిదివఱకు చాలా తినివున్నాను. మీ రా కుట్రలో చేరివున్నట్లు బాగా తెలిసింది. మీరు ఆలోచనాపరులే అయితే ఆలేఖనుగూర్చి మీవ్యాసంలో యెత్తుకోగూడదు. అయితే మీకు ఆమాత్రం ఆలోచనేవుంటే పింగళివారిని తి. వెం. కవులు వెక్కిరించారని డాబుడాబడం యెందుకువస్తుంది? అంతా అనాలోచనే, యిదీ వక అవాంతరానాలోచన. అనఁగా నాటకంలో అంతర్నాటకం వంటి దన్నమాట. దానివిషయం ముందుచూచుకుందాం. ముందు తి. వెం., పిం, సూ, గారిని వెక్కిరించారన్న మీ వాక్యాన్ని సమర్థించుకోండి. త్వరపడండి. సభకు రమ్మంటే కూడా యెట్లో వస్తాను.


★ ★ ★