పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/258

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

262

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


గానంలో ప్రవేశపెట్టడం సకృత్తుగాకనపడుతుంది. యే హరి నాగభూషణం వంటిఛాందస గాయకులో తప్ప తమ తమ సంతానాన్ని గానంలో ప్రవేశపెట్టడమే లేదు - నాగభూషణంగారేనా నామాదిరిని కొడుకులకు - ఏ.బీ.సీ.డీ.లు కూడా రాకుండే పద్ధతిలో వుంచలేదు. కొంచెం రాజకీయ విద్యలోనూ పరిచితి వుందనిపించినట్లే. నాగభూషణంవంటి గాయకులు యీ కాలంలో అరుదనే చెప్పాలి. ఏమంటే ఇంగ్లీషులో బీ.యే. ఫస్టుగ్రేడు ప్లీడరూ, అసలు బి.యల్. ప్యాసయి అడ్వొకేటు అనిపించుకో తగ్గవాఁడే, కాని దానికి అంతకుముందు గర్భంలో పడ్డ రోజుల్లోనే అవలంబించిన సంగీతం బాధించి, అంటే (అంతాయింతా కాదు. సంగీతముచేత బేరసారము లుడిగెన్" అన్నమాదిరి నన్నమాట.) ఫస్టుగ్రేడు ప్లీడరు కావలసి వచ్చింది. అంతవరకూ సంగీతానికీ యింగ్లీషుకీ సమంగానే తన కాలాన్ని వినియోగపఱచేవాఁడు. కాని ఆ చెన్నపట్నంలో యెవరో - అయ్యరుగారి ఫిడేలుబాణీ విని ఆమాదిరిని వాయించాలని దీక్ష కలిగి యింగ్లీషు చెట్టెక్కించడంచేత - రాజకీయ విద్యలో మార్కులు లోపించాయి. బీ.యల్. కాలేకపోయి పిదప ఫస్టుగ్రేడుగా మాఱేఁడు. యీలాటివారు నామిత్రవర్గంలో యింకొకరున్నారు. వారు పూర్వాశ్రమంలో కే. టీ. రామారావుగారు - వీరు యమ్.యే. డిగ్రీపొంది కాలేజీలో లెక్చరరుగా రు. 100-0-0ల జీతంలో వుండిన్నీ బి.యల్. పరీక్షకు చదివేనిమిత్తం చెన్నపురి వెళ్లి అక్కడ ప్రస్థానత్రయం చదవడాని కారంభించి తుదకు తత్ఫలితం అనుకూలించి “పరమహంసలు'గా పరిణమించి ధన్యులైనారు. నాగభూషణంగారు యిటీవల - ప్రస్థానత్రయ శాంతిచేశారు. చాలా నిష్ఠాగరిష్ఠులు, సంస్కృతంలో మంచి పాండిత్యం, ఉభయ భాషలలో కవిత్వం వొకటేమిటి? మన ప్రాంతంలో యిన్ని విద్యలు వచ్చి యింత సదాచార సంపత్తి కలిగిన శిష్టులింకొకరు లేరేమో (ఛాందసత్వం సరేసరి) అనిపిస్తుంది. గానంలో చెన్నపట్నం వెళ్లకముందే నా ముందర తుంబురు నారదులు పనికిరారనే అభినివేశం వుండేది. (ఆయీ విషయం యితరత్రభంగ్యంతరంగా వ్రాసినట్టే జ్ఞాపకం) గాని నేనూ, కే.టీ. రామా రావుగారూ, యింకా కొందఱూ యీతనికి ప్రతిపక్ష గాయకులను అభిమానించే తెగ. యెడ్డెమంటే? తెడ్డెం'గా వాదిస్తూ వుండేవాళ్లం. ధనకోటి, నాగరత్నం, భవాని మొదలైన సుప్రసిద్ధ గాయనీమణుల సంగీత సభలు జరిగినప్పుడు శ్రీయుతులు సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రులవారికీ గఱకపర్తి కోటయ్య దేవరగారికీ ఫ్రీ టిక్కెట్లు పంపించడం సరేసరి కాని, వారితోపాటు నాకూ, శ్రీ కే.టీ. రామారావుగారికీ కూడా వచ్చేవని జ్ఞాపకం.

నాగభూషణంగారు అప్పటికీ సుమారు యిరవైయేళ్ల వయస్సులో వుండేవారు. బహుశః, బి. యే. క్లాసు విద్యార్థిదశలో వుంటారని తోస్తుంది. యీయనకు - ఫ్రీ టిక్కెట్టు పంపేవారు కారు. పోనీ అని గుట్టుగా వూరుకోవచ్చునా? అలా వూరుకోక అస్మదాదులతో