పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

254

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ప్రతీవాఁడికీ వచ్చివుంటుంది. దానితో-శుద్ధ సురన్నది రుద్రరూపమై అని ప్రారంభిస్తాఁడు. తేలిన సారాంశం, తెలుఁగులోనే కాని- కేవల కవీ - విద్వత్కవీ అనే భేదం సంస్కృతంలో పాటింపవలసి వుండదు. వెలివేసినట్టు పూర్వులు కేవల కవులను కేటాయించి- “కేవల కవయస్తు కేవలం కపయః" అన్నారు. అంటే అన్నారు గాక యీ కాలంలో - సంఫేుశక్తిః

ఇది విషయాంతరం. కవులు భిక్షాటకులుగా స్థూలదృష్టికి గోచరించినా, భిక్షాటకులు కారనే మనం తెలుసుకోవాలి. పైఁగా రాజులను (రాజ్య మదమత్తులను) భిక్షాటకులుగా చేసినట్టు - వేములవాడ భీమకవిగారి చరిత్ర ఘాషిస్తూవుంది.

సీ. “రాజకళింగగంగ్రాజు భిక్షకుఁడౌట కవివరేణ్యుల కోప కలనఁగాదె?... కరుణగల్గిన యిల్లు బంగారమౌను కరుణ దప్పిన నడవియౌగడియలోన బ్రహ్మకొడుకైన గవులకు భయముఁజెందు" (శ్రవణా) ఆ యీ సందర్భాన్ని ఋజువు చేసిన కవులు పూర్వులలో చాలామంది వున్నారు.

కాని యిటీవలివారిలో పిండిప్రోలికవిని చెప్పవలసి వుంటుంది. ఈయన పెద్ద విద్వత్కవి కాకపోయినా నిగ్రహానుగ్రహసమర్థుఁడు. విద్వత్కవులు గల సభలో నిర్భయంగా తన కవిత్వాన్ని వినిపించగలవాఁడు. యీయనకున్నూ, శిష్టు కృష్ణమూర్తి విద్వత్కవిగారికిన్నీ తఱచుగా యుక్తి ప్రయుక్తులూవాదోపవాదాలూ జరుగుతూవుండేవి. వాట్లలోయీపిండి ప్రోలికవియెప్పుడూ తీసిపోయినట్టు లేదు. దీన్ని బట్టి ఈయన నేఁటి కేవల కవుల వంటి వాఁడు కాడఁని స్పష్టం. దావు దమ్మన్నగారు యీయన లంకభూమిని యేడు పందుములు (24 యకరాలన్నమాట) పశుబలంచేత అపహరించేటప్పటికి లంకావిజయం అనేపేరుతో వొక ద్వ్యర్థి కావ్యం రచించి తనభూమిని (కోర్టుకువెళ్లకుండానే) తిరిగీ సంపాదించుకున్న అభిమానశాలి. ఆద్వ్యర్థి కావ్యానికి రావణదమ్మీయం అనినామాతరం వుంది. లంకావిజయం అనే పేరుకన్న రెండో పేరేలోకంలో మిక్కిలిగా వ్యాప్తిలోవుంది. రాములవారి భార్యను అపహరించిన రావణాసురుఁడికి పట్టిన దుర్గతే దమ్మన్నగారికి పట్టిందని చెప్పఁగా విన్నాను. నాచిన్నతనం నాఁటికి యీ లక్ష్మణకవిగారిని ప్రత్యక్షంగా యెఱిఁగిన వృద్దులు కొంతమంది వున్నారు

(1) మర్ల పేరు సౌమయాజులుగారు (యానాం ఫ్రెంచిటవును)

(2) ఉప్పులూరి రామజోగన్న సిద్ధాంతిగారు (కొత్తపల్లి ఐలండు)

వీరిద్దరివల్లనూ నాకు లక్ష్మణకవిగారినీ శిష్టుకృష్ణమూర్తిగారినీ బాగా తెలుసుకొనే భాగ్యం కలిగింది - యిందులో 1) కృష్ణమూర్తిగారు. వేదం, శాస్త్రం, సంగీతం యింకా