పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవులు భిక్షాటకులేనా?

253


క్రియలోమాట తురగా రామకవి పద్యాలు చూస్తే తెలుఁగు కవులలోనే కాదు, సంస్కృతకవులలో కూడా అంతటి తృణీకృత బ్రహ్మ పురందరుఁడు లేడనే తోస్తుంది. అతని ధారలోనే వొక విధమైన "వైశిష్ట్యం” కనపడుతుంది. చూడండి.

ఉII రాతిరి మేము పస్తు, హయరత్నము పస్తు, కవీంద్ర యాచక వ్రాతము పస్తు, నర్మసచివాగ్రణి పస్తు (పైభాగం కొంత జ్ఞాపకం లేదు. ఉన్నదానిలో కొంత అసభ్యమగుటచే వుటంకించలేదు) ... ... పస్తికనేమి చెప్పుదున్

ఇది రామకవిగారి పద్యమే. దీనిలోవున్న సిబ్బందీ చూస్తే పూర్వం కవులు (అందఱూ కాదు కొందఱే) మతగురువులలాగు దేశం తిరిగి వసూలు చేసేవారేమో? అనిపిస్తుంది. నిగ్రహానుగ్రహదక్షులుగా వుండడంచేత వారికి ఆవిధంగా సాఁగిందనుకోవాలి. తురగా రామకవి ఆ యీ దక్షులలో నెంబర్‌వన్. ఇతనివి లోకంలో లెక్కకి చాటువులు పదికంటే ఎక్కువ చిక్కవు. కాని మహాగ్రంథాలు రచించిన నన్నయాదులతోపాటు భాషా ప్రపంచంలో యితనికి పేరు వుంది. ఇత డెంతవాఁడో చెప్పడానికి వశంకాదు. ఇంతవఱకు వ్రాసిన చర్చవల్ల కవులు, “భిక్షాటకులు" కారనే తేలుతుంది. వూరకే వినయార్థం కాళిదాసు - “మాంతు భిక్షాటనమ్” అని అనివుంటాఁడు. కవులుభిక్షాటక తరగతికి చెందినవారే అయితే

“ఎదురైనచోఁ దన మద కరీంద్రము డిగ్గి
 కేలూఁత యొసగి యెక్కించి కొనియె"

ఇట్టి గౌరవం జరగడం అసంభవం కదా! మంత్రిత్వంలో లోపాయికారీగా అనుభవించే ఐశ్వర్యం యెక్కువగా వుంటే వుంటుంది. పైకి కవికున్న గౌరవం, మంత్రులకు వుండదు. మంత్రి నవుకర్ల తరగతివాఁడు. కవి యే తరగతివాఁడూ కాఁడు. యెంత ఐశ్వర్యం అనుభవించినా మంత్రికి జగ్గప్పా అనే సంబోధన. కవిని అలా యేకవచనంతో యే మహారాజు పిలుస్తాఁడు, పైఁగా -

1. ఎదురైనచోఁ దన మదకరీంద్రము డిగ్గి కేలూఁత యొసఁగి యెక్కించుకుంటాడు.

2. పురమేగఁ బల్లకి తనకేలఁబట్టి యెత్తుతాడు.

యింకోటి. మంత్రి రాజుకు నమస్కరించాలి. కవికో రాజే నమస్కరించాలి. కవులలో రెండు తరగతు లుండడం యెఱుఁగుదురు గదా!

1) కేవల కవులూ; 2) విద్వత్కవులు అనే యీ రెండు తెగలలో సంస్కృతకవులు సర్వులూ విద్వత్కవులే. శాస్త్ర జ్ఞానంతో మిళితమైన సాహిత్యం వుంటేనే తప్ప సంస్కృతంలో వొక్క అనుష్టుప్పు సైతం నడవదు. తెలుఁగో ఆలాటిది కాదు. మాతృభాష వుగ్గుబాలతో