పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/130

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

134

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


పాదనమే సీతాపహరణాది చిక్కులకు కారణమయినట్టు కనపడుతుందిగదా! యేదో విధంగా భయపెట్టి పొమ్మంటే అంత చిక్కు రాకపోయేదేమో? త్రిలోకాధిపత్యాన్ని నిర్వహిస్తూవున్న రావణాసురుఁడి సోదరీమణి కదా ఆశూర్పణఖ. తుట్టతుదను మండోదరి సంధిమాటలు చెప్పినప్పుడు రావణుఁడు చెప్పినమాట చూడండి యేలా వుందోను :-

చ. "ఎఱిఁగి యెఱింగి మున్నతఁడె యెగ్గొనరించిన దానికైకదా!
      చెఱఁగొని వచ్చితిన్ బిదప సీత, వృథా కథలింక నేల? పెం
      పఱ బ్రదుకింతతీయనె? ఖరాదుల చావున కేమిగాని నీ
      మఱఁదలి బన్న మేపగిది మానిని? యీఁగుదుసంధి చేసినన్"

యింతటి విపత్తు కలిగిస్తుంది. అని మొట్టమొదట లక్ష్మణుడికిగాని రాముడికిఁ గాని యేలేశమేనా గోచరించేయెడల శూర్పణఖను అంతగా అవమానించడం జరిగేది కాదేమో?"

ఆ యీ సందర్భాలు పరిశీలించిచూస్తే వొకcడు శాంతుcడుగా వుండడానికి కాని, మఱివొక్కఁడు అశాంతుఁడుగా వుండడానికిఁగాని కారణం వక్కభవితవ్యత తప్ప వేఱొకటి కనపడదు. అయినప్పటికీ సర్వ సామాన్యంగా ప్రతీవిషయానికిన్నీ దీనితో సంబంధం కలపడమనేది ఆచారంలోలేదు. పూర్వజన్మకృత పుణ్యపాపాలతో సంబంధం ప్రతీదానికీ వున్నప్పటికీ వాట్లకే ప్రాధాన్యం యిచ్చేయడల యెవఁడున్నూ దోషిగాఁగాని, నిర్దోషుఁడుగాc గాని యెక్కడా ప్రపంచంచేత వాడుకోఁ బడడానికి అవకాశమే వుండకపోవలసివస్తుంది. అప్పుడు కొన్ని వ్యవహారాలకుచాలా చిక్కువస్తుంది. అందుచేత ఆ తోవ వదలుకొని మంచిచెడ్డలకు కర్తృత్వం మనదే అనుకొని మాట్లాడుకొందాం. యీలామాట్లాడుకొనే పక్షంలో యొవcడికేనాసరే శాంతుఁడుగా వుండడంకన్న వుత్తమమార్గం కనపడదు. శాంతికన్న సౌఖ్యాన్ని యిచ్చేది వేఱిదిన్నీ వున్నట్టు తోఁచదు. శ్రీకృష్ణ భగవానులుకూడా,

“శ్లో యస్మాన్నోద్విజతేలోకో లోకా న్నోద్విజతే చయః
    హర్షామర్షభయోద్వేగైర్ముక్తో యస్స చ మే ప్రియః"

అని తెల్పివున్నారు. త్యాగరాయలవారు “శాంతము లేక సౌఖ్యము లేదు.” అంటూ పైసందర్భాన్నే గానంచేసి ఉన్నారు. అందుచేత సర్వవిధాలా శాంతిసంపాదనానికై శాయశక్తులా ప్రయత్నంచేయడం ప్రతిమనిషికిన్నీ ఆవశ్యకమైనపని. యెట్లో పెద్దల సేవవల్లనో గ్రంథావలోడనంవల్లనో అట్టిశాంతి సంప్రాప్తమయితే కావచ్చును గాని సంప్రాప్తమైన ఆ మహాధనాన్ని కాపాడుకోవడం చాలాకష్టసాధ్యం. యీ మహావస్తువును

%.