పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/104

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిసస్యగర్భభూదానం

పెద్దలు దానాలవిషయంలో చాలా గ్రంథాల్లో వ్రాసివుంచారు. స్వీకరించడానికీ యివ్వడానికీకూడా బ్రాహ్మల కధికార ముందనిన్నీ క్షత్రియాదులకు యివ్వడానికి మాత్రమే కాని పుచ్చుకోవడానికి అధికారం లేదనిన్నీకూడా వారే వ్రాసివున్నారు. కాని యీ యిరవయ్యో శతాబ్దంలో బ్రాహ్మణేతరులు తిరగంబడి దాన్ని విశ్వసించడంలేదు. ముఖ్యంగా ఆ యా పురాణాలేమి ధర్మశాస్తాలేమి మీ బ్రాహ్మలే వ్రాసుకున్నారు. కాCబట్టి మీకు అనుకూలంగా వ్రాసుకున్నారు. అంటూ ఆపాతరమణీయమైన యుక్తి నొకదాన్ని చెప్పి పైవిషయాన్ని బ్రాహ్మణేతరులు తృణప్రాయంగా ఖండిస్తూ వున్నారు. నేనుకూడా బ్రాహ్మణ్ణి అవడంచేత దీన్ని గుఱించి యింతకన్న ఎక్కువగా వ్రాసినప్పటికి వృథా పరిశ్రమమే కాని ప్రయోజనం వుండదని యెంచి ఆజోలికిపోక ప్రస్తుతాంశాన్ని గూర్చి రెండుమాటలు వ్రాస్తూవున్నాను.

దానాలలో చాలా విధాలున్నాయి. వాట్లలో చాలాభాగము యిచ్చేవాళ్లకు పుణ్యాన్ని సంపాదించే విన్నీ పుచ్చుకునేవాళ్లకు పాపాన్ని సంఘటించేవిన్నీ అని గ్రంథాల్లోనే వ్రాయంబడివుంది. బ్రాహ్మలు బ్రాహ్మలకోసం రాసుకున్నారని చెప్పేవారికి అనుకూలించని సంగతులుకూడా ఆ గ్రంథాల్లోనే కనబడుతూ వున్నాయి బోలెండు. నిజమైన బ్రాహ్మండు. లేశమున్నూ ప్రతిగ్రహమే చేయకూడదని పలుచోట్ల వ్రాసివున్నారు. "పౌరోహిత్యం రజనిచరితం" అంటూ కొన్నిటిని యేకరు పెట్టి యివి నాకు జన్మజన్మాలకూ వద్దని భగవంతుణ్ణి ప్రార్ధించినట్లు అభియుక్తుల శ్లోకాలు కనపడతాయి.

ఆ యీ నిషేధం కన్యాభూసరస్వతులనుగూర్చి యొక్కడా వున్నట్లు లేదు. అన్నాన్ని కూడా యితరత్ర స్వీకరించడానికి మనపూర్వులు వప్పుకోనేలేదు. “తస్మాదన్నం నగృహీయాత్ ప్రాజైః కంఠగతై రపి" ఆ కారణంచేతనే శ్రీ బులుసు పాపయ్యశాస్రులవారి వంటి మహాపండితులు కొందఱు యీ విషయంలో చాలా అసిధారావ్రతంగా ప్రవర్తించినట్లు వింటాము. కన్యకను వకరివల్ల స్వీకరిస్తేనేకాని ప్రపంచప్రవృత్తే సాంగదు కనుక దాన్ని నిషేధించలేదు. భూదానం పుచ్చుకోకపోతే కన్యాదానానికి వచ్చే చిక్కువంటి చిక్కులేదుగాని యెందుచేతో దాన్ని నిషేధించలేదు. సరస్వతీదానం అంటే విద్యాదానం. దీన్ని నిషేధిస్తే లోకం అంధకారంలో పడిపోవలసి వస్తుంది. గనక దీన్ని కూడా వుభయతారకంకిందనే మనపూర్వులు జమకట్టివున్నారు.