పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/103

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మద్యనిషేధం అవసరమే!

107

బాలవృద్ధాతురులు చిక్కుపడతారు. కనక దాన్ని మినహాయించడమే కాకుండా దాని వెల కూడా యిటీవల అభివృద్ధి పొందిన స్థితినుండి తగ్గించి తేలికచేయవలసిందనిన్నీ దీని కెన్నో ఉదాహరణలు చూపవచ్చును. వ్యాసం చాలా విస్తరించింది. కళల మాట దేవుడెఱుంగును గాని ప్రకృతం మద్యంతోపాటు నల్లమందు కూడా దొరకుండాచేస్తారేమో అనే భయంతో నేను దీన్ని మొదలుపెట్టి వున్నాను. సుమారు 16 సంవత్సరాలనుంచి నేను దాని సహాయంతోటే జీవయాత్ర గడుపుతూ వున్నాను. యీదేశంలో నావంటి వాళ్లేందతో ఉండి ఉంటారు. వీళ్లేవళూ షోకేళాగా దీన్ని అభ్యసించినవాళ్లు కారు. అందుచేత దాన్ని తేలికవెలకు కాకపోయినా యిప్పటి వెలకేనా దొరికే టట్టుగాచేస్తే చాలునని కాంగ్రెసుమంత్రులను కోరుతూ యీ వ్యాసాన్ని ముగిస్తూవున్నాను. -

★ ★ ★