పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోమటి వేమన

33

మే మొసఁగినదే తిరిగి మాకొసఁగి పంపెదరా యనెను. రా జయిదువేలు కొమ్మనెను. కవి (ఆర్వేలనియోగి) కులమును గుంచించెదరా యనెను. రాజు ఆఱువే లిచ్చితి ననెను. కవి నేను పుట్టువుతోడనే యార్వేలవాఁడ ననెను. రాజు చాతుర్యమునకు మెచ్చి యేడువేలు కొనుమనెను. కవి సంఖ్య మంచిది కాదనెను. రా జెనిమిదివేలిచ్చి పుచ్చెను.

కాటయ వేమన

క. వెలయాలు శిశువు నల్లుఁఢు
    నిలయేలిక యాచకుండు నేగురు ధరలోఁ
    గలిమియు లేమియుఁ దలఁపరు
    కలియుగమునఁ గీర్తిగామ! కాటయవేమా!

కోమటి వేమన

ఈతని యాస్థానమున శ్రీనాథకవిసార్వభౌముఁఢు విద్యాధికారి. అమరుశతకవ్యాఖ్యాత. వేమభూపాలచరిత సాహిత్యచింతామణ్యాదికృతులకు నాయకుఁడు.

క. ఈరేడుజగము లనఁ జె
    న్నారెడు పదునాల్గుగ్రుడ్ల ననిశము ఱెక్కల్
    సారించి పొదుగుచున్నది
    కోరిక నీకీర్తిహంసి కోమటివేమా.
సీ. వీరశాత్రవరాజవృక్షముల్ పడగొట్టి
                    దుర్మార్గపురములు దుక్కిదున్ని