32
చాటుపద్యమణిమంజరి
అనవేమనృపాలుఁడు
క. కవితాకన్యకు నలుగురు
కవి జనకుఁడు భట్టు దాది గణుతింపంగా
నవరసరసికుఁడె పెనిమిటి
యవివేకియె తోడఁబుట్టు వనవేమనృపా!
క. కొంచపుజగములలోపల
నంచితముగ నీదుకీర్తి యనవేమనృపా!
మించెను గరి ముకురంబునఁ
బంచాక్షరిలోన శివుఁడు బలసినభంగిన్.
గీ. పందికొ మ్మెక్కి పెనుపాముపడగ లెక్కి
మేటితామేటివీఁ పెక్కి మెట్టలెక్క
విసివి వేసారు యనవేమవిభునిఁ జేరి
రాణివాసంబుగతి మించె రత్నగర్భ.
క. రాకున్నఁ బిలువఁ డేనియు
రాకకు ముద మంది చేర రమ్మనఁ డేనిన్
ఆఁకొన్న నీయఁడేనియు
నాకొలు వటు కాల్చవలయు ననవేమనృపా!
శ్లో. అనవేమమహీపాల స్వస్త్యస్తు తవ బాహవే
అహవే రిపురోద్దండచంద్రమండలరాహవే!
ఈశ్లోకము ననవేమనృపాలునిపై నొకకవి చెప్పఁగా సంతసించి రాజు మూఁడువేలు పారితోషిక మొసఁగెనట. కవి నేను నాల్గువేలు (వే అను నక్షరములు) ఒసఁగిన మీరు మూఁడువే లిచ్చెదరా యనెను. రాజు నాల్గువేఁ లొసఁగితి ననెను. కవి