పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

చాటుపద్యరత్నాకరము

నుపాయముం జెప్పుమనెనఁట. అంతట నీకవి పద్యమొకటి తాటియాకుపై లిఖించి యిచ్చి యాయాకుఁ దోఁటవాకిటఁ గట్టించుమని చెప్ప నాతఁ డట్లొనరింపఁగా నక్కలరాక తగ్గెనఁట. ఆపద్య మిది—

క. ఆశీవిషసమ మగు నా
   యాశుకవిత్వంబుచేత నటువంచకముల్
   నాశము గావలెఁ జూడుమ
   హే శాంభవి! చౌడమాంబ! హే శర్వాణీ!

అట్లు నక్కలకు వాకట్టు కట్టుటవలననే రాజుగారు తన కాయింటిపో రొసఁగినట్లు పద్యమునఁ జెప్పికొన్నాఁడు.

ఉ. ఎంచఁగలం డనంతవసుధీశుని యిక్షువనంబు నోళ్ళ ఖం
   డించిన నక్కలన్ విషపటిష్ఠపుఁ బద్యముఁ జెప్పి వాని ని
   ర్జించిన నింటిపేరు దయచేసిరి నక్కలపాటివా రటం
   చు.............................................................

పిండిప్రోలు లక్ష్మణకవి

ఈకవి పదునెనిమిదవ శతాబ్దిలో నున్నవాఁడు. ప్రౌఢకవి. ఇతఁడు రావణదమ్మీయ మను ద్వ్యర్థికావ్యమును రచించెను. ఈతని సమకాలికులగు శిష్టు కృష్ణమూర్తి, మొక్కపాటి పేరిశాస్త్రి మొదలగుకవులతో నీకవికి వివాదము విశేషముగా జరిగెను. కృష్ణకవి కోటరామచంద్రపురము పరగణాజమీన్దారుఁడగు కాకర్లపూఁడి రామచంద్రరాజుగారిపై సర్వకామదాపరి