పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమతరంగము

31

   చిద్రూపుఁ డితఁడు కేవల
   రుద్రుఁడయా కందుకూరు రుద్రుఁడు ధాత్రిన్.

అనెను. అందుమీఁద నాస్థానపతి యిరువురికయ్య మాపి రుద్రకవిని సమ్మానించి పంపెను. భద్రకవి కిట్టి యసూయ తగదని బుద్ధిచెప్పెను.

నక్కలపాటి సంజీవరాయకవి


మట్లెవేంకటరామరాజుగారికిని వేమల వేంకటరాజుగారికిని నిరంతరవైరము. అట్టి సందర్భములో నీనక్కలపాటిసంజీవరాయకవి యొక్క కందముతోనే యిరువురివలనను బహుమానము లందెనఁట. ఆకందపద్య మిది—

క. స్వామి విను మట్లె వేంక
   ట్రామక్ష్మాజాని నీదురణజయభేరీ
   ఢామద్వని విని జరగఁడె?
   వేమలచిన బసవరాయ వేంకటనృపతీ.

ఇతఁడు ఎవరిని దర్శింపఁబోయినప్పుడు వారిని సంబోధించి సమన్వయించి తనయుక్తిసామర్థ్యములం జూపి వారి మన్ననల నందియుండు. ఇంచుకదోషమున్నను నీతనియుక్తిమాత్రము కొనియాడఁదగియున్నది.

మట్లెయనంతభూపాలుని చెఱకుఁదోఁటను నక్కలు పాడుచేయ నాభూరమణుం డీకవిరాయనిం బిలిచి నక్కలు పోవు