పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

చాటుపద్యరత్నాకరము

   ర్మాటలచేతఁ గామినులు మన్ననఁ జేసి సుఖంబు లిచ్చెద
   ర్మాటలు నేరకున్న నవమానము న్యూనము మానభంగమున్.

మ. రసవాదంబులు పెక్కు నేర్చిన మహారాజేంద్రులన్ గెల్చినన్
   వెస సన్మంత్రము లుచ్చరించిన మహావిద్య ల్ప్రసంగించినన్
   అసహాయంబగు శూరత న్గనినఁ దానంబోధి లంఘించినన్
   నొసటన్వ్రాసినవ్రాలు కన్నఁగలదా నూఱేండ్లు చింతించినన్.

చ. గురువులరాక దాసిమృతి గుఱ్ఱఁపుదాడియు వానవెల్లువల్
   పొరుగున నప్పుబాధ చెవిపోటును దొమ్మరులాట యింటిలో
   వరసతిగర్భవేదన వివాహము విత్తుట యల్లునల్కయున్
   గఱవు దరిద్ర మాబ్దికము గల్గె నొకప్పుడు కృష్ణభూవరా!

ఉ. నిన్నటిరేయి నేఁ గలను నీకుఁ బ్రయాణ మెఱుంగకుండ నే
   తిన్నఁగ నిద్రలేచి కడు దీవ్రముగాఁ జనుదేర నీవు నా
   కన్నను మున్నుగా నచటఁ గన్పడవచ్చితి దుర్ఘటంబ! నీ
   వెన్నున బండలెత్త నట విస్తరలో నిడినట్టిసర్వసి
   ద్ధాన్నము తట్టివేసితి వహా! గ్రహచారమ! దుర్విచారమా!

ఉ. అద్దిర! సింబవోగణము నర్జనుఁడెక్కుక శిద్దిరాజుపై
   యిద్దెముసేయనడ్డెముక యేటుకునేశ; గనేశునెక్కిరా
   సుద్దులిబీసనుండొదర సోద్దెముగాఁగను రాభరావణా
   యిద్దెము సూస్తినంచు వచియించును మూర్ఖుఁడు సంగమేశ్వరా!

ఉ. [1]“నల్లనిదేంది? బేరి!” “మృగనాభిర గొల్లడ!” “దాన్ని దిందురా?”
   “అల్లటు గాదు, స్త్రీలు చనులందునఁ బూతురు!” “పూసినంతనే
   జల్లునఁ జేపు వచ్చి తెగజాఱున?” “కాదు సుగంధ మబ్బు” “మా
   పిల్లకు కాస్త పెట్టు” మన బేరియుఁ గస్తురి మూసెఁ గ్రక్కునన్.

  1. నల్లనిం బేరి! మృగనాభిర వల్లవ! దీన్ని తిందురా!
       ఫుల్లసరోజలోచనలు పూతురు చన్నులఁ బూసినంతనే
       జల్లున చేపునా? యెగసి తన్నక ఊరక పాలొసంగునా! (?)
       గుల్లకు నెంతయె త్తనుచు గొంగడి పర్చిన నవ్వి రందరున్.