పుట:Chanpuramayanam018866mbp.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

73

చతుర్థాశ్వాసము


జానకీజాని నన్వేషించి యంచిత హవిర్గంధగంధవహకిశోరహెూమధూమదూరతోవిభావ్యమానంబును నచలితహరిణగణలిరోహితశరీర వనదేవతావితాన శీలితోపహారప్రసూనంబును నిశీధినీచరపిశాచవాటీ సముచ్చాటనప్రవీణ మంత్రాయమాణ రామానుజధనుర్నినదనిశమనసముచితసమీపఘటితదళకుటీరజటికుటుంబ పరిచయకరంబితమహీభాగంబును, ననేకశాఖిశాఖావలంబమాన వల్కలాజినప్రతానంబును, నంబరపురాయాత దివిజశాతోదరీకరకిసలయానీతపారిజాత సౌరసదవారిజాత కీలితవితానసీతావిహరణాగార తరుతలప్రచురవిచికిలలతాజాయమానకాయమానంబును, నధ్యుటజచత్వరాలక్షితసాలమూల హిమకరోపలవితర్దికానిహితసితకృపాణతూణీర వారవాణ బాణాసనవతంసంబును, నతిథికులసపర్యాపర్యుత్సుక సుమిత్రాపుత్రనిత్యాహితామందకందమూలఫలకోశమందిరాయితైకదేశంబును, నవిరహిత ధరణితనయాచరణవిన్యాసధన్యతా పరిహసితసాకేతరామణీయకంబును నగురామాశ్రమంబు నొంది కైకయీనందనుండు కందళితమానసానందుండై యంతట.

103


సీ.

మినుమినుక్కను సీతమేనికాంతఁ గడానివలువత ళ్కొలయు వల్కలమువాని
ఘనసారతిలకవైఖరి ఫాలతలమునం దీక్షింపఁ దగుహెూమరక్షవాని
జలసేకజనితపాటలిమఁ గాంచనకిరీటతగాంచు జాటజూటంబువాని
మహిమండలి వహించురహినాదిభోగిభోగముల మించుభుజాయుగంబువాని


గీ.

తమ్ములనదమ్ములనెడునేత్రములవాని, నునుమొయిలుచాయలుడివోనితనువువాని
నకృతసుకృతావిధేయత నమరువాని, రాము శ్రీరాము శాంత్యభిరాముఁ గాంచె.

104


చ.

కని యారామసమీపసీమ లతయై కన్పించు క్రొమ్మించుఁ బో
ణి వరణ్యాని కయోధ్యటెక్కు జిగిచే నిర్మించు రాజీవపా
ణి నిమిక్షోణికళత్రు వంగడపుమున్నీటన్ సముద్భూతిఁ గాం
చినజైవాతృకరేఖ భూమితనయన్ సేవించె సాధ్వీమణిన్.

105


ఉ.

ఏనృపుఁ డాసుమిత్ర కుదయించియుఁ దా నితరానవాప్యరా
మానుజచర్యఁ గాంచు నిశలం దపనిద్రతఁ జెందెనేని యె
వ్వాని కనుంగవం జెనయు వారిజబృందము లందు రాగుణ
శ్రీనిధి నూర్మిళేశు నిజదృక్పథముం దొరయించె నంతటన్.

106


చ.

మరుగతి మండువేసవిని మ్రగ్గి తలంకెడు జింక పంకజా
కర మెదుటం గనుం గొనినకైవడి రాఘవుఁ గాంచి తత్పదాం