పుట:Chanpuramayanam018866mbp.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28 చంపూరామాయణము

సీ. వనిఁ ద్రోయఁడే చంద్రవతిఁ గూఁతు రనక యుద్ధతి నాచికేతుమాతామహుండు
పినతల్లి యనక నిర్భేదింపఁడా మున్ను దితినిండుగర్భంబు శతమఖుండు
ప్రియకాంత యనక డుల్పింపఁడా రేణుకాతరుణియౌదల జమదగ్నిమౌని
బ్రాహ్మణి యని గణింపక తెంపుతోఁ బట్టి చంపఁడా భృగురాణిఁ జక్రపాణి
గీ. నడతదప్పినయప్పుడె కెడపఁజెల్లు, బుధవితతినైన యతినైనఁ బొలఁతినైన
దయదలఁప నీకు నిటువంటి భయదబలత, మనుకుటిలశీల యబలయె మనుకులేశ. 76

ఉ. నా విని యావినీతరిపునాముఁడు రాముఁడు కర్ణపాళియం
దావిబుధారి నారి గుణ మంటియు నంటకమున్న టంక్రియా
రావమునన్ ధనుర్గుణము రక్కసినొంచుట కెచ్చరింప ర
క్షోవిసరాంగశోణితముఁ గ్రోలియెఱుంగనికోల యేయుడున్. 77

తాటకను రాముఁడు వధించుట

క. ప్రాణాహుతి గొనె నాశిత, బాణావలి యాతుధానభామినిపంచ
ప్రాణముల రావణాదిమ, కోణపసముదయము బుత్తికొనుటకు మొదలన్. 78

క. తాటక నీగతి శరహతి, గీటడఁచి నిజాతఝాటకీర్తికవాట
జ్యాటంకృతి యగురఘుపతి, యాటోపముఁ జూచి పొంగి రమరులు నింగిన్. 79

క. అంతటఁ గౌశికుఁడు గృశా, శ్వాంతికభృతజృంభకాదిశస్త్రనికాయం
బంతేవాసికి రామున, కెంతేవాసిగ నొసంగె నింద్రునియాజ్ఞన్. 80

ఉ. కౌశికుఁ డస్త్రదేశికుఁ డొకానొకదేశము సత్యలోకనీ
కాశముఁ జూపి యోరిపువిఖండన కంటివె నైగమాంతవా
ణీశరణీభవన్మునిమణీఖని నీవని నాశరేందిరా
నాశకళాపటుండు కుహనావటుఁ డున్నజనైకపావనిన్. 81

చ. క్షితి నుదయంబుఁ జెంది బలిగీమునకున్ వడి వేరువాఱి యు
న్నత మగురూపుఁ బూని గగనస్థలి లోఁగొని యచ్చటం దరు
ప్రతతి చెలంగు లోకపరిరక్షకభిక్షుకచర్యఁ గన్న యా
మతకరిపొట్టిదిట్టమహిమంబు విడంబ మొనర్చు కైవడిన్. 82

విశ్వామిత్రుఁడు యజ్ఞమునకుఁ బ్రారంభించుట

వ. అని యిత్తెఱంగునం దరంగితామందమందాకినీవికచకనకారవిందమకరందనిష్యందమధురిమానర్ఘ్యంబును, సచిరసంకోచిత ప్రచురతరమార్గదైర్ఘ్యంబును,