పుట:Chanpuramayanam018866mbp.pdf/43

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 29

నగునిజలాపసరణిం దరణికులపావనుల వీనులకు విందు సంధించుచు మదాంధసింధురపురంధ్రీకర్ణాంచలచలనసంచారితసమీరణనివార్యమాణపంచాననద్వ్యణుకమధ్యాశ్రమం బగుసిద్ధాశ్రమంబునకు నేగి యాగాధినందనుండు యాగంబునకు నుద్యోగం బొనర్చి యున్న సమయంబున నంభోజినీకుటుంబబింబగోచరుండగు హిమాచలకుమారికాసహచరశిరోభూషణం బైనయోషధీరమణుకతన భీతిలుచు వెలువడిన తద్గళాంతరాళవసదరాళతరకరాళహాలాహలంబు పోలికఁ త్రిలోకీవిక్షోభకారియగు రక్షోబలారికి నగారంబైన తనదు నేరంబు పరిహరింప దాశరథియై యున్న వెన్నునకు విన్నపంబు సేయింప దదీయవంశకర్త యగువికర్తనుసమీపంబునకు యామునానుబంధంబునం జేరఁబోవులవణవారాశితీరున నఖండపటుకళాధూర్వహుండై పర్వశర్వరింగూడి క్రీడించుజాడ రేఱేఁడు నాతోడివేడుకకు రాఁడని యుపశమంబుతో హరిపదోపాంతసీమాసమాసన్న యగునమాయామినివిధంబున నంబరైకదేశంబునం ద్రిశంకుండు నివసించుటం జేసి నానాఁటికీఁ బ్రబలు నీచవాటిక నతిస్ఫూర్తి వర్తిల్లు దివాకీర్తిబృందంబుచందంబున దశస్యందననందనాగ్రణి మహోగ్రచాపప్రతాపకీలికీలాకలాపంబున నకూపారకుమారవిహరదమరారివీరవరశరీరపటలంబులం బుటంబు లిడుట కంభోరుహకుమారుం డనునయస్కారుండు సంఘటించిన యింగాలసంఘంబుభంగి బంగరుగట్టుపట్టు కాఱడవి నిర్గమించు సౌవర్గవాహినిజలావగాహంబునకు వచ్చు నుచ్చైశ్శ్రవోవనస్తంబేరమకదంబకంబు డంబున, నిలింపసంపత్కలమపారంపరుల కింపు సొంపు సంపాదించు రాత్రించరవధూటికాకోటికన్నీటియలజళ్ల కాదికారణంబై, కౌశికారాధనీయచిత్రభానుప్రభానిరోధకం బైనధారాధరనికాయంబుసోయగంబున మహాబిలంబునం దుండియు మరుద్గ్రసనలాలసంబై తోచు మేచకాస్తోకదర్వీకరానీకంబువీఁక, నాకసంబున భయానకం బగుపలాదలోకంబు నాలోకించి కించిత్తైన ధైర్యంబు లేక యాకులంబైన యాజకసమూహంబు లితరేతరంబు ని ట్లని గణియింపం దొడంగె. 83

చ. తపసులపాలిమృత్యువులు దైత్యులు వీ రిల నున్ననాళ్లకుం
దప మని చేయఁ గూడునో వ్రతం బని పట్టఁగ శక్యమో వితా
యిపు డిది యేటియత్నము వహించె వివేకవిహీనుఁ డైనయీ
నృపముని యంచుఁ గౌశికు పయిం గడు నేరము లెంచువారలున్. 84