పుట:Chandrika-Parinayamu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వకలతావలయ వల్లవపల్లవాధరామండల మధ్యస్థల సందర్శనీయ పురందరశిలాశిఖర నందనందన సంభృత రంజిత వేణుదండాయమాన మానిత కటకవాల వాయజ సూత్రానుబింబంబు లహిరూపంబులుగా నెఱింగి యుప్పొంగి చెంగున నెగసి చరణంబులం ద్రొక్కిపట్టి చంచూపుటంబుల సించి ఱెక్కల నడిచి యేమియుం దేరకున్న విస్మయంబు మనంబు బెరయ విఫల ప్రయత్నంబులై పుడమి వ్రాలు కాంతార మయూర దారకంబులం జొచ్చి కికాకిక కేళి సల్పు గరుడసరోజ ముఖీ నికరంబుల దరస్మిత విలాసంబున సమధిక పథికచేతస్తాప సంవర్ధక ప్రసవామోద పరంపరలఁ జెన్నుమీఱు పున్నాగపూగంబులవలనఁ బున్నాగ పూగ మధుసాల రసాలముఖ్య దివ్యతర్వంతరంబున మంజులకంజరాగ భిత్తిభాగ మరీచిపుంజంబు భాస్వదాతప ప్రాబల్య ఖంజనంబును, శాతకుంభకుంభవిభా డంబరంబు సంధ్యారాగారంభంబును, వలభిన్మణివలభి రుచిరరుచి పూరంబు నిబిడ తిమిర వివర్ధనం బును, ముక్తోల్లోలవిభాసారంబు దారకానిసర్గంబును, భూరిస్తంభ సంగ్రథిత హీరదర్పణ ద్యుతిజాతంబు నిస్తంద్ర చంద్రికా కల్ప నంబునుం గావింప నక్షీణ క్షణదైక విలసనంబునం బొలుచు కేళికాహర్మ్యంబున మిక్కిలి పిక్కటిల్లు మక్కువఁ జక్కెరవిల్తుజగడంబుల మగలఁ జొక్కించి యాత్మీయ పుంభావసంభా వనా సంభూతశ్రమంబు దూలఁ జెంగటి వనుల సంచరించు నాగకన్యావతంసంబుల యాగాఢ నిశ్శ్వాస సమీరంబుల తోరంబగు సిరి నొప్పారు సిందువారంబులవలన సిందువారాది నగవార శిలాతలంబుల నురులు దాల్చియు, నెత్తమ్ము లిమ్ముగాఁ బ్రవహించు సెలయేఱులపై వలలు సేర్చియు, స్వజాతి ద్విజా తుల రాఁబిలుచు పులుగుల దీములు గట్టియు, జిగురుఁగండె లమర్చియు, విచిత్రతరవనపతత్త్రిగోత్రం బులం బట్టుకొను తలంపున మెండైన పొదలనుండి యప్పటప్పటికి వానిం గానఁ దమకించి చెంచెత లెత్తు నెమ్మొగంబు తమ్మిచాయల వసంతసమయ సముదిత సౌభాగ్యమ్మునం బొదలు చామ్పేయ ధాత్రీరుహం బులవలనఁ జామ్పేయధాత్రీరుహ కుసుమగళిత పరాగరాశి మధురసనదీ పులినదేశంబునఁ గపురంపుట నంటి లేయాకుఁ బఱచి మరకత మకరకేతనాహితమూర్తిని నిలిపి తదేక