పుట:Chandrika-Parinayamu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ. సకల జగచ్ఛాసన పాండితీ ధురంధరుం డగు నా రాజశేఖరుం డొక్కనాఁ డాత్మీయసేవాసమాయాత నానాదిశాధినాయక మనోమహోత్పలోల్లాస సంపాదకవిభావిభాసిత చంద్రమకుటాలంకృతోత్తమాంగుండును, గరుణారసపరిపూరితాపాంగుండును, నఖిలభువనవిజిగీషుప్రసవేషుయోజితరసాలశరాసనాంతరదృశ్యమాన కోకనదపలాశాదభ్రవిభ్రమద భ్రూమధ్యవిరోచమాన శిఖిశిఖాంచిత విశేషకవిశేషుండును, వదనేందు నిర్గత చంద్రికాయిత దరహాస భూషుండును, మహాభోగ మణిగణ సముపే తాహీనాంగద శోభిత బాహుండును, నతనుభూతి భాసమాన దేహుండును, ననవధి కైక సద్ద్యుతి యుక్త హార విభూషిత గళుండును, శారద ఘన ప్రభా జయకృత్త్యసితాంశుక సంవేష్టిత నితంబతలుండును, హరివిరోచన సంతతి రసాధీశరాజ వరమకుటవాటికా ఘటిత సరోజ రాగమరీచి రాజి నీరాజిత చరణ కుశేశయుండును, ధీరగ ణాలో కామోదదాయి శృంగారాతిశయుండును నగుచుఁ గలిత మహారజతకూట స్తంభవారంబులం, గమ నీయ కాంచన వితాన గుచ్ఛ ప్రభాంకూరంబులం, గలకంఠికాజన గానామృ తాసారంబులం గర మొప్పు కలధౌతాగారారాజ దాస్థానభవనరాజంబునం గనత్తరాహిరిపుమణిమయ భద్రాసనంబున సుఖాసీనుండై, యహిత మహాబల విధ్వంసన శంసనీయ సామర్థ్య ధురీణుండు గావున నిజపరాభూతి కారణ దారుణ సమీరణ సముత్సారణంబు గోరి తనకు విన్నవింపం జేరిన మేఘమండలంబుడంబున నొక్క విబుధ కుధర కుచారత్నంబు వట్టిన మేఘడంబరంబు గనకఝల్లరీ శంపావల్లరీ భాసురం బై యేపు సూప, నరిభేద నోదార కరకాండ మండిత రాజసాహాయ్యంబును, నతిదీప్రతర ప్రకాశాన్విత సదనీక సాంగత్యంబును నధిగమించి విజృంభించు నిశాధిదేవతతో జగడంబు చరింప నోపక పట్టువడిన యంబుజాప్తబింబంబు తీరున నొక్కహరినీలకుంతలావతంసంబు వూనిన యభిరూప జాతరూప హంసరూప ధూప కరండంబు వలనఁ జాలుగా వెడలు సామ్రాణి ధూప ధూమమాలికలు తదంతర సంస్థాయి రమారమణ తనూతల వినిర్య దభిరామ శ్యామ ధామాళికల మోహంబు నివ్వటిల్లఁ జేయ, నిరంకుశ పంకజరాగకంకణ క్రేంకార పూర్వకంబుగా నొక్క రాజకీరవాణీలలామ వీచు ధవళవాల