పుట:Chandragupta-Chakravarti.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

చంద్రగుప్త చక్రవర్తి


తాము దేశాంతరమునకు వెడలిపోయిరి. వారు వెడలు నప్పుడు నడిపివాని భార్య గర్భవతియై యుండెను. కాని యా సమాచారమా బాహ్మణునకుఁ దెలియదు. ఆపెకు నొక కుమారుఁడు కలిగెను. వానికిఁ బుత్రకుఁడని పేరుపెట్టిరి. కాని, బ్రాహ్మణులు తిరిగి రానందునను, కఱ వధికమైనందునను పుత్రకునిఁ దీసికొని యాతని తల్లి మగధదేశమునకుఁ బోవలసినదాయెను. అచ్చట ఈమె దనకుమారునితోఁ గూడ యజ్ఞదత్తుఁడను బ్రాహ్మణు నాశ్రయించి యుండెను.

పుత్రుకుఁడు పెద్దవాఁడై విద్యాబుద్ధులు నేర్చుకొని మిక్కిలి ధనమును ఆర్జించెను. తన తండ్రియు పినతండి పెదతండ్రులును దేశాంతరమువెళ్ళి రాలేదన్న సమాచారము విని వారిని కనుఁగొను నిమిత్తమై యొక యన్న సత్రములు స్థాపించి తాను సత్రాధికారిగనుండి వచ్చిపోవువారి గోత్రనామములఁ దెలిసికొను చుండెను. ఆ మువ్వురు బ్రాహ్మణులును ఒక్కదిన మా సత్రమునకు రాఁ దటస్థించెను. వారా పుత్రకుని సమాచారమంతయుఁ దెలిసికొని వాఁడు వ్యభిచార జాతుఁడుగాఁ దలంచి వానిని జంపుటకుఁ గొందఱు పురుషులను నియమించిరి. పుత్రకుఁడు వారికి లంచమిచ్చి వారి చేతినుండి తప్పించుకొని వింధ్యప్రాంతమునకుఁ బోయెను. ఈతఁ డచ్చట చంచరించు చుండ నిద్దరన్నదమ్ములు రాక్షస కుమారులు తమ పిత్రార్జితమైన మూఁడు వస్తువులను గూర్చి తగవులాడు చుండఁ . జూచెను. వారు తగవులాడుచున్న వస్తువు లేవన 1 భోజన