పుట:Chandragupta-Chakravarti.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవ ప్రకరణము

69


చున్నాఁడు. ఇంకొకవ్యుత్పత్తి కలదు. కోసి గంగాసంగమమున రాజమహాలునకు సమీపమున పాలిబోత్రయుండెనఁట ఇప్పటికిని మత్స్యదేశమున పాలి జూతివారు మెండుగ నివసించెదరు. కావున పాలిబోత్రయని పేరువచ్చెననియుఁ జెప్పఁబడుచున్నది. సూర్యవంశపు రాజగు మముండను వానికి 18 వ తరమువాఁడు సుదశన్‌న రాజనియు, ఆతని కూఁతురు పాటలియనియు, నీమె మూలమున పాటలిపుత్ర నామంబనియు నింకొక వాఖ్యానంబు గాన వచ్చుచున్నది.

మఱియొక చిత్రకథ

దక్షిణదేశమునందు నొక బాహ్మణుఁడు కలడు వానికి ముగ్గురు కొమాళ్లుండిరి. ఆ బ్రాహ్మణుఁడు. చిన్నవారై న తన పుత్రులను ఇంటియొద్దనే యుంచి హిమాలయ మందలి గంగాద్వారమునకు యాత్ర వెడలి యచ్చటనే కాలధర్మము నొందెను. ఎంతకాలమునకును తండ్రి తిరిగిరానందున అతని ముగ్గురుపుత్రులును విద్యాభ్యాసము నిమిత్తమై బయలుదేరి కుమారస్వామి క్షేత్రము నొద్దనున్న చించణీ యను గ్రామ మందు నివసించియున్న భోజకుఁడను విద్వాంసుఁడైన బ్రాహ్మణుని ఆశ్రయించిరి. అ బ్రాహ్మణుఁడు వీరి ముగ్గురికిని తగిన విద్యలఁ గజపి తనకు ముగ్గురు కూఁతులుండ వీరిముగ్గురికినిచ్చి వివాహము చేసి వారిని తన యింటనే యుంచుకొనెను.

వారు పెద్దకాల మచ్చటనే యుండి యొకప్పుడు కఱవు సంభవింపఁగాఁ దమ భార్యలను అచ్చటనే యుంచి ధనార్జనకై .