పుట:Chandragupta-Chakravarti.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ ప్రకరణము

55


అలెగ్జాండరు హిందూదేశమునకు వచ్చినప్పు డతనితో నేతెంచిన పండితులును, చంద్రగుప్తుని దివాణమునకు రాయబారిగ వచ్చిన మెగస్తనీస్ అనువాఁడును వాని ననుసరించి మఱియు ననేకులగు గ్రీకు గ్రంథకారులును సాంద్రకోటస్ లేక శాంద్రగోప్తస్ అనువాఁడు అలెగ్జాండరును మొదట వచ్చి చూచినట్టును అలెగ్జాండరు చనిపోయిన కొలఁది కాలములోనే అతఁడు పంజాబు దేశమునుండి గ్రీకు సైనికులను వెడలఁగొట్టి స్వతంత్రుఁ డైనట్టును అతని రాజధాని గంగయొడ్డున పాలిబోత్రానామముతో మిగుల వైభవమునొందిన పట్టణమైనట్టును అతనికి పూర్వమున రాజుగనుండినది. నంద్రన్ అనువాఁడైనట్టును వానియందు జనులకు ద్వేషము గలిగినందున సాంద్రకోటన్ వానిని జంపి రాజైనట్టును వ్రాసియున్నారు. మొట్టమొదట సాంద్రకోటస్ అన నెవ్వఁడో దెలియక పోయెనుగాని పై వర్ణనలన్నియు చక్కగ విమర్శించి పాశ్చాత్య విద్వాంసులు సాంద్రకోటస్ అనగా చంద్రగుప్తుఁ డనియు పాలిహోత్ర యనగా పాటలీపుత్రమనియు నండ్రస్ అనగా నందుఁడనియు నిశ్చయించి యున్నారు. పాలిహోత్రకును గంగానదికిని గల యంతరము మెగస్తనీస్ వ్రాసి యున్నాఁడు. అదియును ప్రస్తుతము పాట్నా పట్టణమునకును గంగకును గల యంతరముతో సరిపోవుచున్నది. ఇంతియగాక పాలిహోత్ర గంగా శోణల సంగమము వలన గలిగిన యంతర్వేదిలో నున్నదని అతఁడు వ్రాసిన విషయము ప్రస్తుతము పాట్నా, అనఁగా పూర్వపు పాటలీపురమునకే, అన్వయించుచున్నది, కావున