పుట:Chandragupta-Chakravarti.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

చంద్రగుప్త చక్రవర్తి


పాలిహోత్ర యనగా పాటలీపురమనియు, సాంద్రకోటస్ అనఁగా చంద్రగుప్తుఁడనియు ఈతఁడే సెల్యూకస్ నికేతర్ నోడించిననియు, ఇతని రాజధాని పాటలీపురమనియు మనము గట్టిగఁ జెప్పవచ్చును.

కాలనిర్ణయమునకు రెండవసాధనము

ఇట్లు మనమొక నిశ్చయమైన సాధనమును బట్టి చంద్రగుప్తుని కాలమును కనుగొంటిమి. ఇదియే నిజమైనదని నొక్కి వక్కాణించుటకు మఱియొక స్వతంత్ర సాధనముకలదు. మొదటి సాధనమునకును దీనికిని సంబంధములేక దీన వేఱువిధముగ లెక్కలువేసి పై కాలమునే సాధించుటవలన దీనిని స్వతంత్ర సాధనమంటిమి.

చంద్రగుప్తుని కుమారుడు బిందుసారుడు. బిందుసారుని కుమారుఁడు అశోక వర్ధనుఁడు. ఇతఁడే ధర్మోపదేశార్ధమై తన రాజ్యము నందంతటను శిలాశాసనములను చెక్కించి వేయించి మిక్కిలి ఖ్యాతివడసిన అశోకుఁడు. ఇతని శాసనములలో అశోకుఁడనెడు నామము లేదు. ప్రియదర్శియన్న సంస్కృత పదమునకు ప్రాకృతరూపమైన పియదశి నామముకలదు. కాని అశోకునికే ప్రియదర్శియనిన నామాంతరము గలదని మనము పెక్కు సాధనములవలన నిశ్చయింపవచ్చును. *[1] ఈవిషయము

  1. *ఇందును గురించి యధికము తెలిసికొనఁ గోరువారు The Journal of the Royal Asiatic Society యొక్క 1801 వ సంవత్సరపు సంపుటలో Identity of Piyedasi with Asoka Maurya అన్న వ్యాసము చూడనగును.