పుట:Chandragupta-Chakravarti.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

చంద్రగుప్త చక్రవర్తి


మఱియొక కథ. మయూరదేశపు రాణికి బుట్టి చాణక్యున కమ్మబడిన వాడని వేఱొక కథ, ఆరాణి కని పసుల కొట్టమందుంచి పోఁగ గొల్లవాడు కాపాడి చాణక్యున కమ్మిన శిశువని యింకొక కథ, మోరియను రాణి మారువేషమున బుష్పపురమున బిడ్డను గని జాడిలోనిడ చన్డుడన్న యెద్దు సంరక్షించినందున బసులకాపరిచే చండగుప్త నామమందిన బాలుడని యైదవకధ, పర్వత రాజపుత్రునితో పాటలి వదలి పోయి వింధ్య ప్రాంతమున నొక గొల్లపాళెమునందు దేజస్వియగు బాలచంద్ర గుప్తుడు తోటి గోపాలబాలురతో రాజుమంత్రుల యాట లాడుచుండ నతడు కులీన సంభవుడని చాణక్యు డూహించి యా బాలుని విలువకు దీసికొనిన దాఱవకథ. కావున నతడు ఈ కులమున బుట్టినవాడని నిర్ణయించుట ఇంచుమించుగ నశక్యము. ముద్రారాక్షసమున నతడు వృషలుడుగ నెన్నబడి యున్నాడు. చాణక్యు డతనిని చాటున వృషలుఁడను చున్నాడు. ఎదుటను వృషల యనుచున్నాడు. జాతి వివేకమునందు వృషలుఁడనగ అంబష్ఠునకు శూద్రియందు బుట్టినవాడని వివరణ. మహానందియను శైశునాగుల గడపటి రాజునకు శూద్రియందు మహాపద్ము డుదయించె ననునది పురాణ సిద్ధము. ప్లూటార్కు ద్వారా మహానంది అంబష్ఠుడని తెలియుచున్నది. కావున మహాపద్మనందుడే వృషలుఁడాయెను. అతని కొమారుడును వృషలుడనిన, చంద్రగుప్తుడే కాక నందులును వృషలు లయిరి. తక్కిన కథలెల్ల చంద్రగుప్తుని