పుట:Chandragupta-Chakravarti.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము

23


కుఱ్ఱనిఁ గొని, యతని మెడకు లక్ష విలువగల బంగారు ప్రోగుతోఁ జుట్టబడిన యొక కంబళిత్రాటిని జుట్టి కట్టెనఁట. పర్వత రాజపుత్రునకు నిటువంటి త్రాటిని మెడకు గట్టించెను. ఒకనాడా యిద్దఱు బాలురును విచిత్రములైన కలలు కనిరట. అంత నా బ్రాహ్మణుండు పార్వతుని బిలిచి నిదురించుచున్న చంద్రగుప్తుని మెడత్రాటిని త్రెంపకయు వీడ్వకయు నతనిని మేలుకొలుపకయు దెమ్మని చెప్ప, పార్వతుడు చేతకాక వచ్చెను. మఱునాడు పార్వతుడు నిదురింపగ చంద్రగుప్తుని బిలిచి యమ్మెయినే ఆనతియ్య నితడు చేతికత్తితో పార్వతుని శిరమును ద్రుంచి త్రాటిని తెచ్చి సమర్పించెనట. అదిగని చంద్రగుప్తుని యోగపురుషునిగ నిర్ణయించి నాఁటనుండి యేడు వత్సరములలో సమస్త విద్యా విశారదునిగ జేసెను.

గ్రీకుల వ్రాతలు

చంద్రగుప్తుడు చిన్న వయస్సులోనే మగధరాజు కోపమునకు బాత్రుడై పాటలీపురమునుండి తక్షశిలా ప్రదేశమునకు అనగా పంజాబు దేశమునకు బాఱిపోయి యచ్చట సైన్యమును గూర్చుకొని అదివఱకు రాజ్యము చేయుచుండిన గ్రీకువారిని వెడలగొట్టి, పిదప నందుల సంహరించి మగధ రాజ్యమును స్వాధీన పఱుచుకొనెను.

గాథల సమన్వయము

ఇట్లు చంద్రగుప్తుని జనననును గుఱించి, సర్వార్ధసిద్ధి మనుమడని యొకకథ, ధననందునికి మురయందు బుట్టినవాడని