పుట:Chandragupta-Chakravarti.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

చంద్రగుప్త చక్రవర్తి


మంత్రిత్వము చేయనొల్లక యన్న సత్రాధికారిగ నుండుచు నందుల కప్రఖ్యాతి వచ్చునటుల గుట్రలు పన్నుచు దుదిని వాణక్యుని కోపమును రేగించి నంద నిర్మూలము గావించెనట.

నందుని యధర్మపుత్రుడగు మౌర్యుడు బలసాహసములచేఁ బేరువడసెను. ఇతనికి చంద్రగుప్తుడు మున్నగు నూఱుగురు సుతులు గలిగిరి. వీరు మహా బలాడ్యులు. మౌర్యుడును మౌర్యుని నూర్గురు పుత్రులును నవనందుల సైన్యమునకు అధిపతులుగ జేయబడిరి. కాని పుత్ర సమేతుడయిన మౌర్యుడు రాజ్యము నపహరించునేమో యని నందులకు నసూయ హెచ్చెను. కావున దమ యుద్యాన వనమున నొక కృత్రిమ శిల్ప గృహమును నిర్మించి మంత్రాలోచన మిష మీద మౌర్యుల నచ్చటికి రావించి వారలనందఱను నేలక్రింది గుహలో బ్రవేశపెట్టిరి. చంద్రగుప్తుడు దప్ప మిగిలిన వారంద ఱచ్చట భూగర్భమందు దుర్మరణము నొందిరి. చంద్రగుప్తుడు మాత్రము తప్పించుకొని లోనుండి బయటికివెడలెను..

చంద్రగుప్తుడు చాణక్యుని నాశ్రయించుట

ఆజాను బాహుండును, రాజలక్షణ సమన్వితుండును, ఔదార్య శౌర్యగాంభీర్య నిధియు, వినయ వారిధియు నైన యాతని నా ఈర్ష్యాళులు నందులు తిరిగి సమయింప గపటోపాయముల బన్నిరి. ఉన్నత పదవియం దునిచిన నంతఃక్షోభమును, వెడలగొట్టిన బాహ్యక్షోభమును బుట్టించునని